విజయనగరం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధుల సాధనే మా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, ఫిబ్రవరి 20: అశాస్ర్తియంగా విభజించబడిన రాష్ట్భ్రావృద్ధికి నిధులు సాధించడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖామంత్రి చినరాజప్ప తెలిపారు. మంగళవారం ఆయన ఎస్.కోట నియెజకవర్గంలోని ఎల్.కోట మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. బిసి, ఎస్సీ కాలనీలలో పర్యటించిన ఆయన నూతన నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను, పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, దానికి సమానమైన ప్యాకేజీ కానీ సాధించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. నిధులు సాధించేందుకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. స్వల్పకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు బెంగపడవద్దని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైకాపా ఎంపిల రాజీనామా, కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అనే మాటలు జగన్ అవిజ్ఞతకు నిదర్శనమని ఆయన చెప్పారు. స్పష్టమైన మెజార్టీ లేకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి అబాసుపాలు కాకుండా అన్ని పార్టీలు కలసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపిలు చెబుతున్న లెక్కలకు, రాష్ట్రానికి వస్తున్న నిధులకు పొంతన లేదని పేర్కొన్నారు. తమ మంత్రివర్గంలో ఉన్న మాణిక్యాలరావు విమర్శలపై విలేఖరులు ప్రశ్నించగా మిత్ర ధర్మానికి కట్టుబడి దేశం పార్టీ అధినేత సూచనల మేరకు తమ పార్టీ నాయకులు సంయవనంతో వౌనం పాటిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలచుకుంటే ఎవరు గుండుగీయించుకుంటారో వారికి తెలుసని ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితోపాటు నియోజకవర్గ సమన్వయకర్త కె.వి. ఎ.రాంప్రసాద్, ఐదు మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ రంగస్థల నటుడు బ్రహ్మానందం ఆకస్మిక మృతి
నెల్లిమర్ల, ఫిబ్రవరి 20: ఎపిటి ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకుడు ప్రముఖ రంగస్థల నటుడు జరజాపుపేటకు చెందిన ఆరిపాక బ్రహ్మానందం మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. బ్రహ్మానందం మాస్టారుకు భార్య రాజేశ్వరి, కుమారు, కుమార్తె ఉన్నారు. బ్రహ్మానందం మృతితో అటు కళారంగం ఇటు ఉపాధ్యాయ రంగంలో సహచరులు తీవ్ర దిగ్భ్రాందికి గురయ్యారు. ఈయన సుమారు 30 సంవత్సరాల పాటు కళారంగానికి సేవచేసి 350 ప్రదర్శనలు ఇచ్చారు. ఈయన రాష్టస్థ్రాయి అవార్డులు కూడా గెలుచుకున్నారు. బ్రహ్మానందం భౌతిక కాయాన్ని వైసిపి పాలక మండలి సభ్యులు పి.సాంబశివరాజు, నాయకులు సూర్యనారాయణరాజు, వెంకటరమణ, గదల సన్యాసినాయుడు, మాజీ జడ్పీటిసి సింగ్‌బాబు, టిడిపి నాయకులు రవిశేఖర్, లెంక అప్పలనాయుడు, చిక్కాల సాంబశివరావు, నాగేశ్వరరావులు సందర్శించి నివాళులు అర్పించారు.

మార్కెట్ యార్డును పరిశీలించిన కమిషనర్
గజపతినగరం, ఫిబ్రవరి 20: గజపతినగరం మార్కెట్ యార్డును మంగళవారం సాయంత్రం ఆ శాఖ కమిషనర్ ఆనంద్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌యార్డులో కోటి 22లక్షల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని చైర్మన్ నర్సింహవర్మ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. 3.50లక్షలతో గేట్లు, 19లక్షలతో రైతులకు విశ్రాంతి భవనం, 28లక్షలతో రైతులకు కూరగాయల షెడ్లు, 69.70 లక్షలతో గొడౌం చుట్టూ సిసి రహదారుల నిర్మాణం తదితర పనులు చేపడతామని చైర్మన్ నర్సింహవర్మ తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించేందుకు వీలుగా 50లక్షల రూపాయలతో భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని కమిషనర్ ఆనంద్‌కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బొండపల్లి జడ్పీటిసి బండారు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
* డిపో మూసి ఉంటే 500 జరిమానా
గజపతినగరం, ఫిబ్రవరి 20: ప్రతి రేషన్ డీలర్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, వాటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి సుబ్బరాజు హెచ్చరించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు, మండలాల రేషన్ డిపోల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు నిర్ణీత సమయానికి రేషన్ డిపోను తెరచి ఉంచాలని డీలర్లకు సూచించారు. డిపో మూసి వుంటే రోజుకు 500రూపాయల వంతున డీలర్లకు అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. రోజుకు ఒక వినియోగదారుడుతోనైనా విక్రయాలు తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు. నిబంధనల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. రేషన్ సకాలంలో విడిపించాలని, మూడు నెలల పాటు వరుసగా అపరాధ రుసుముతో సరుకులు విడిపించే డీలర్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ సరుకులు తీసుకువెళ్లిన వెంటనే మిషన్‌లో సరుకులు వివరాలు నమోదుచేయాలని, లేని పక్షంలో ఆర్ ఎ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దత్తిరాజేరు, మెంటాడ మండలాల రేషన్ డీలర్లు సరుకులు పంపిణీలో వెనుకబడి ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఎస్‌ఒ సత్యనారాయణరాజు మాట్లాడుతూ రేషన్ డిపోల పనివేళలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా పనిచేయని ఇ- పాస్ యంత్రాలు, సిమ్‌కార్డు సమస్యలు తమను వేధిస్తున్నాయని రేషన్ డీలర్లు ముక్తకంఠంతో డి ఎస్ ఒకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ 23వ తేదీన యంత్రాలు మరమ్మతు పనులు చేపడతామని, ప్రతి నెల 1,10తేదీలలో సాంకేతిక నిపుణలను మరమ్మతు పనులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో సిఎస్‌డిటిలు వి.సత్యనారాయణమూర్తి, మల్లిఖార్జునరావు, గొడౌన్ ఇన్‌చార్జ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.