విజయనగరం

కోమటిపల్లి సీబీఎం పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 22: ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులను భర్తీచేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. ఈమేరకు మండలం కోమటిపల్లి సీబీఎం పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు గత 7 నెలలక్రితం పదవీవిరమణ పొందారు. అయితే అప్పటి నుంచి ఇంతవరకు అధికారులు ఆ పాఠశాలకు ఎవరినీ ఉపాధ్యాయులుగా నియమించకపోవడంతో స్వచ్ఛందంగా విద్యావలంటీరే విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులు 14మంది విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరికి ఉపాధ్యాయులను ఎందుకు నియమించడం లేదని పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకానికి మాత్రమే విద్యార్థులు పరిమితమవుతున్నారే తప్ప విద్యను పొందలేకపోతున్నారు. స్వచ్ఛందంగా వస్తున్న విద్యావలంటీర్ కూడా ఎప్పుడు వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు అంటున్నారు. గత గురువారం ఈ పాఠశాలను విలేఖర్లు పరిశీలించగా విద్యావలంటీర్ గత 4రోజులుగా రాకపోవడంతో ఖాళీగానే విద్యార్థులు కూర్చొన్నారు. నిర్వాహకులు వంటలు చేసిన అనంతరం భోజనాలు పెట్టి వారు చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వాహకులకు సంబంధించి బియ్యం, తదితర వాటిని సరఫరా చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయులను నియమించడంలో అలసత్వం వహించడం పట్ల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి సీబీ ఎం పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎంఇఓ వివరణ
ఈ విషయంపై ఎంఇఓ సిహెచ్ లక్ష్మణరావును వివరణ కోరగా ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టులను ప్రభుత్వం భర్తీచేయలేదని, అయితే అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను నియమించనున్నామన్నారు.

ప్రశాంతంగా టెట్ పరీక్ష
బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 22: మండలం కోమటిపల్లిలోని స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 150మంది అభ్యర్థులకు గాను 5గురు గైర్హజరయ్యారని, మధ్యాహ్నం 150మంది అభ్యర్థులు గాను 3గురు గైర్హజరయ్యారని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు పూర్తిస్థాయిలో వౌళిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12.30ని.ల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30ని.ల వరకు పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలు వచ్చేనెల 3వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

విజ్ఞానాన్ని పెంపొందించేందుకు
గ్రంథాలయాలు ఎంతో దోహదం
కొమరాడ, ఫిబ్రవరి 22: విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని గ్రంథాలయాల జిల్లా కార్యదర్శి సూర్యనారాయణమూర్తి అన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి గ్రంథాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 2016-17 సంవత్సరానికి సంబంధించి వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు వచ్చానన్నారు. జిల్లాలో గ్రంథాలయాలకు సొంత భవనాల నిర్మాణాల కోసం 12లక్షల 60వేల రూపాయల చొప్పున 10 గ్రంథాలయాల భవనాలకు మంజూరయ్యాయన్నారు. వీటిలో గజపతినగరం, సీతానగరం, మెరకముడిదాం, బాడంగి, రామభద్రపురం, నెల్లిమర్ల, భోగాపురం, గరివిడి, ఎల్‌కోట తదితర ప్రాంతాల్లో గ్రంథాలయాలకు నిదులు మంజూరయ్యాయన్నారు. మండలంలో కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు జనరల్ నాలెడ్జీకి సంబంధించిన పుస్తకాలు లేవని, వీటిని మంజూరుచేస్తామన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన వెంట గౌరీశ్వరరావు, లైబ్రేరియన్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.