విజయనగరం

ఘనంగా శిర్లిపోతన్న పండగ.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), ఫిబ్రవరి 23: పట్ట్ఫంలోని కోట దుర్గాదేవి ఆలయం సమీపంలో గల సిర్తి పోతన్న ఆలయంలో ఘనంగా పండగను నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలనుండే ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. తాము కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సిర్లిపోతన్న ఆలయంలో ఉన్న నాగదేవత పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్దంగా గుడ్లు, పసుపు, కుంకుమ, బియ్యం, ఉలవలు,వేపాకులను సమర్పించారు. ఆలయ నిర్వాహకులు సింగరోతు కుటుంబ సభ్యులు భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా..
పార్వతీపురం (రూరల్0, ఫిబ్రవరి 23: వై ఎస్పార్ సీపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని 20 వ వార్డు కౌన్సిల్ సభ్యులు, రైల్వే బోర్డు మెంబర్ ద్వారపురెడ్డి శ్రీనివసరావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం నుంచి పార్టీ దూరంగా ఉంటూ మరలా పార్టీలోకి ప్రవేశం కల్పించిన జిల్లా నాయకులు మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణతో పాటు అరకు పార్లమెంటు అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజులకు జీవింతాంతం రుణపడి ఉంటానన్నారు. పార్వతీపురం నియోజకవర్గంతో పాటు తన వంతుగా పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానన్నారు.రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులతో పనిచేస్తానన్నారు. ఈ నెల 25న జిల్లాకేంద్రంలో భూమన కరుణాకరరెడ్డి బొత్స సత్యన్నారాయణల సమక్షంలో పార్టీలోకి తమ భార్య ద్వారపురెడ్డి జ్యోతితో పాటు, మరల పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారు.