విజయనగరం

జగన్ సిఎం కావాలన్నదే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 23: రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బూత్ కన్వీనర్లు పనిచేయాలని వైకాపా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో బూత్ కన్వీనర్ల వ్యవస్థ లోపం వల్ల కొద్దిపాటి ఓట్ల తేడాతో వైకాపా ఓటమిపాలయ్యిందన్నారు. రానున్న ఎన్నికల్లో బూత్ కన్వీనర్లు వైకాపాను విజేతగా నిలపాలన్నారు. శుక్రవారం పూల్‌బాగ్‌లోని జగన్నాధ కల్యాణ మండపంలో వైకాపా బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ చాలని నిన్నమొన్నటి వరకు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు మాట మార్చి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పడం ఆయన అవకాశవాదమని అన్నారు. కాగా, వైఎస్ జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒకేమాటపై పోరాటం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. గ్రామ స్థాయిలో ఓటర్లను కలుసుకొని ఓట్ల తొలగింపులు, అనర్హత కలిగిన ఓట్లు తెలుసుకొని వాటిపై పనిచేయాలన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో దోపిడీ పాలన జరుగుతుందన్నారు. వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతుందన్నారు. ఆయన పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నోట్ల మార్పిడి, జిఎస్‌టి వంటి మోదీ నిర్ణయాలు దేశాభివృద్ధిని వెనక్కినెట్టాయన్నారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ బూత్ కన్వీనర్లు వారి పోలింగ్ బూత్ పరిధిలో ఏయే సామాజిక వర్గాలు ఉన్నాయో వారి ఓట్ల వివరాలు తెలుసుకొని ఇతర ప్రాంతాల్లో కల ఓటర్లను కూడా మన పార్టీ సానుభూతిపరులుగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకోవాలన్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని భావిస్తున్నారన్నారు. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ పాలన ప్రజలకు ఒక స్వర్ణ యుగమన్నారు. పేదల జీవితాలలో వెలుగునిచ్చిన వ్యక్తి అని కొనియాడారు. జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం కేంద్రంగా చేసుకొని రెండు జిల్లాల్లో 12 నియోజకవర్గాల బూత్ కన్వీనర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారు ఇతర ప్రాంతాల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ 12 నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్లకు పార్టీ ఇస్తున్న శిక్షణను బూత్ కన్వీనర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యులు పి.సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బి.అప్పలనాయుడు, ధర్మాన కృష్ణదాసు, మీసాల నీలకంఠంనాయుడు, పార్టీ నేతలు పాలవలస రాజశేఖర్, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, డాక్టర్ సురేష్, పిల్లా విజయ్‌కుమార్, మామిడి శ్రీకాంత్, చనుమోలు వెంకటరమణ, అంబళ్ల శ్రీరాములనాయుడు, కెవి సూర్యనారాయణరాజు, అవనాపు విజయ్, డోల మన్మధకుమార్, కనకల రఘురామారావు, మహంతి గణపతి తదితరులు పాల్గొన్నారు.

తృటిలో తప్పిన పెను ప్రమాదం
లక్కవరపుకోట, ఫిబ్రవరి 23: మండలంలోని గొల్జాం గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం గడ్డితోకూడిన వాహనం ఊరి మధ్యగుండా వస్తుండగా కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగడంతో వ్యాన్‌లో ఉన్న గడ్డిలో మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్ డ్రైవర్ బెంబేలెత్తిపోయి వ్యాన్‌ను అక్కడే వదిలి దూరంగా పారిపోయాడు. అప్పటికే వ్యాన్‌లో ఉన్న గడ్డి చాలా వరకు కాలపోయింది. ప్రజలు ఆందోళనకు గురైన సందర్భంలో అదే గ్రామానికి చెందిన ఇంకొక డ్రైవర్ వ్యాన్‌ను డ్రైవ్ చేసుకుంటూ ఊరుబయటకు తీసుకువచ్చి దగ్గరలో ఉన్న చెరువులో దించాడు. గ్రామస్తులు చుట్టూ చేరి చెరువులో నీటిని వ్యాన్‌పై చల్లి మంటలను అదుపు చేసి దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.