విజయనగరం

ప్రజ్ఞా వికాస పరీక్షలో లహరి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఫిబ్రవరి 23: జిల్లా వ్యాప్తంగా ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ప్రజ్ఞా వికాస పోటీ పరీక్షలో గొట్లాం గాయత్రి టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థిని పూసర్ల లహరికి జిల్లాస్థాయిలో తృతీయ స్థానం లభించింది. ఈమేరకు శుక్రవారం జిల్లా పరిషత్ సముదాయంలో నిర్వహించి ఈ పోటీ పరీక్షలో లహరి తృతీయ స్థానం సాధించడంతో జిల్లా బిసి సంక్షేమ అధికారి కుష్భూ కొఠారి పాఠశాలను సందర్శించి విద్యార్థిని లహరిని అభినందించారు. అనంతరం బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జగదీశ్వరి, పరిపాలనాధికారి రాఘవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తి పర్యవేక్షణలో వ్యాసరచన పోటీలు
గజపతినగరం, ఫిబ్రవరి 23: గజపతినగరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం న్యాయమూర్తి పల్లి నాగేశ్వరరావు పర్యవేక్షణలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు ప్రాథమిక హక్కులు, విధులపై వ్యాసరచన పోటీలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె.టి. ఆర్. ఆచార్యులు మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించే విధంగా ఇటువంటి వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

డిఇసి మాత్రల పంపిణీలో వాలంటీర్ల పాత్ర కీలకం
* జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవికుమార్‌రెడ్డి
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 23: జిల్లాలో ఫైలేరియా వ్యాధినివారణకు వాలంటీర్లు ప్రత్యేకంగా కృషి చేయాలని, సామూహిక డిఇసి మాత్రల పంపిణీలో కీలకపాత్ర వహించాలని జిల్లా మలేరియ అధికారి డాక్టర్ ఎంఎం రవికుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రకాశం పార్కులోని అర్బన్ ఫైలేరియా యూనిట్ కార్యాలయంలో శుక్రవారం అర్బన్ హెల్త్‌సెంటర్ల వైద్య సిబ్బందికి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 26న జరిగే సామూహిక డిఇసి మాత్రల పంపిణీలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. చెప్పారు. ముఖ్యంగా విజయనగరం పట్టణంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు డిఇసి మాత్రలు అందేలా ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు ప్రత్యేక శ్రద్ద వహించి పర్యవేక్షించాలని సూచించారు. మలేరియా కన్సల్టంట్ రామచంద్రుడు మాట్లాడుతూ ఈనెల 26వతేదీన విజయనగరం జిల్లాలో మాత్రమే సామూహిక డిఇసి మాత్రల పంపిణీ జరుగుతుందని తెలిపారు. మాత్రలు మింగేటప్పుడు వైద్యసిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. సమావేశంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహమూర్తి, ఫైలేరియా సూపర్‌వైజర్లు పి రామకృష్ణ, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

విధేయతగా పనిచేయండి...మెరుగైన సేవలు అందించండి
* ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ అప్పలరాజు విజ్ఞప్తి

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 23: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు విధేయతతో పనిచేయాలని ఆర్టీసీ విజయనగరం రీజనల్‌మేనేజర్ ఎ.అప్పలరాజు అన్నారు. రీజనల్‌మేనేజర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన అధికారులు, డిపోమేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ బస్సుల రాకపోకలలో సమయపాలన పాటించాలని చెప్పారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడపాలన్నారు. ముఖ్యంగా ఆదాయం పెంపుదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. నష్టాలకు కళ్లెం వేసి లాభాల బాటలో నడిపించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు ఎన్‌విఆర్ వరప్రసాద్, కుప్పిలి శ్రీనివాసరావు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కొటాన శ్రీనివాసరావు, డిపోమేజనేర్లు ఎన్‌విఎస్ వేణుగోపాల్ (విజయనగరం), పిబి మల్లిఖార్జునరాజు (ఎస్.కోట), గౌతం ఛట్టర్జీ (సాలూరు), బాబురావు (పార్వతీపురం), ఢిల్లీశ్వరరావు(శ్రీకాకుళం డిపో-1), అరుణకుమారి (శ్రీకాకుళం డిపో-2), శివకుమార్ (పలాస), ధీరజ్ (పాలకొండ), ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి బివిఎస్ నాయుడు, డిప్యూటీ ఇంజనీర్లు ఎంఎస్‌ఆర్ నాయుడు, శ్రీనివాసరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీలో స్తబ్ధత..వైకాపాలో విమర్శల జడివాన
* టిడిపి అధ్యక్షుడి వౌనం

విజయనగరం, ఫిబ్రవరి 23: గత కొంత కాలంగా జిల్లాలో ప్రతిపక్షంగా ఉన్న వైకాపా ప్రభుత్వంపైన, అధికార పార్టీ నేతలపైన విరుచుకుపడుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, జిల్లాకు చెందిన మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మీద వైకాపా నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాకుండా బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి టెండర్ల రద్దు వంటి అంశాలను పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాగా, దీనిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపిన అశోక్ స్పందించలేదని వైకాపా నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇలా ఎప్పటికపుడు వైకాపా విమర్శలను తిప్పికొట్టే పార్టీ నాయకత్వం టిడిపిలో కొరవడింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు వైకాపా చేసిన ప్రతి విమర్శకు ప్రతి విమర్శ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ రకమైన స్పందన కొరవడుతోంది. ప్రభుత్వం మీద వైకాపా నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలపైన కూడా ఖండించడం గానీ, ఎదురు దాడి చేయడం లేదు. ఏదో ఒకటి రెండు సార్లు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు లాంటి వారు అరకొరగా మాట్లాడటం తప్ప జిల్లా అధ్యక్షుడు తనకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో టిడిపికి సమర్ధత కలిగిన నాయకత్వం లేదని భావిస్తున్నారు. గతంలో ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పార్టీని విమర్శించే ప్రతి విమర్శకు అడ్డుగోడగా నిలిచి అలా విమర్శించిన వారిపై విరుచుకుపడేవారు. నేడు తెలుగుదేశంనకు ఆ పరిస్థితి లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించడంలో విఫలమవుతున్నారు. అలాగని ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదు. అలాంటపుడు తెలుగుదేశం పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోకతప్పదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు జిల్లాకు వచ్చినపుడు కేవలం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా పెట్టుకొని విమర్శిస్తున్నారే తప్ప ఇటు మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుగాని, జిల్లా పార్టీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడుగాని విమర్శలకు ప్రతివిమర్శలు చేయడంలో విఫలమవుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.