విజయనగరం

సుబ్రమణ్యేశ్వరస్వామి భారీ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 26: పట్టణంలోని పూల్‌భాగ్‌లో నూతనంగా నిర్మించిన 60 అడుగుల శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామివారి విగ్రహం బుధవారం ప్రారంభించనున్నారు. పూల్‌భాగ్‌లోని శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణం సమీపంలో నిర్మించిన 60 అడుగుల సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ఆలయ పూజారి కర్రివేంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం స్వామివారికి నేత్రోత్సవం నిర్వహించి పూజలు, అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేసారు. ప్రపంచంలో ఇటువంటి విగ్రహం కేవలం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉంది. ఇపుడు ఇంతటి భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత విజయనగరం పట్టణానికి దక్కింది. దీంతో ఆలయం వద్ద భక్తులకు, స్వామివారి సందర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.