విజయనగరం

2.63కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులు: ఇఇ గాయత్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), మార్చి 13: మండలం మోసూరువలస, నారాయణప్పవలస గ్రామ సమీపంలో 13గ్రామాలకు మంచినీటిని అందించేందుకు 2.63కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులను చేపడుతున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ గాయత్రీదేవి అన్నారు. ఈమేరకు జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పనులను త్వరిగతిన పూర్తిచేసి 13గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో 524 రక్షితమంచినీటిపథకాలకు 40కోట్లు నిదులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే 475 రక్షిత మంచినీటి పథకాల పనులు పూర్తికాగా మిగిలిన పనులను నెలాఖరు నాటికి పూర్తిచేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి అన్ని మండలాల్లో క్రాస్ ప్రొగ్రాంను ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకోసం 40లక్షల రూపాయలతో మెటీరియల్స్ కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 2లక్షల 82వేల 799 మరుగుదొడ్లుకు మొదటివిడత మొత్తాలను లబ్ధిదారులకు అందించామన్నారు. అదేవిధంగా 9వేల మరుగుదొడ్లుకు 2వ విడత మొత్తాలను అందించామన్నారు. ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నిర్మించిన వాటికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఈమెతోపాటు డీఇఇ పిఎంకె రెడ్డి, ఏఇ పప్పల శంకరరావు ఉన్నారు.

మరుగుదొడ్లు నిర్మాణాల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: ఆర్డీఓ
బొబ్బిలి(రూరల్), మార్చి 13: మరుగుదొడ్లు నిర్మాణాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల ప్రత్యేక అధికారి బి సుదర్శనదొర హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నాటికి శతశాతం మరుగుదొడ్లు నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గ్రామ ప్రత్యేక అధికారులు ఆయాగ్రామాలకు వెళ్లి మరుగుదొడ్లు నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేవిధంగా కృషి చేయాలన్నారు. ఎవరైన విదులను సక్రమంగా నిర్వహించకపోతే వేటు తప్పదన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతతో పనిచేసి మండలానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అనంతరం హౌసింగ్ ఏఇలు సింహాచలం, సత్యారావులతో గృహనిర్మాణాలపై చర్చించారు. గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో మంజూరైన ఇళ్లకు శంకుస్థాపనలు చేయాలన్నారు. వేసవికాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసేందుకు అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి తహశీల్దార్ రెడ్డి సాయికృష్ణ, ఎంపీడీఓ ఆర్‌వి పద్మజ, ఇఓపీఆర్‌డీ రాజు, ఏపీఓ సుశీల, తదితరులు పాల్గొన్నారు.

ఒంటరి మహిళల సమస్యలను పరిష్కరించాలి
బొబ్బిలి(రూరల్), మార్చి 13: ఒంటరి మహిళల సమస్యలను పరిష్కరించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు వి ఇందిర డిమాండ్ చేశారు. ఈమేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒంటరి మహిళలు మంగళవారం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మేము ఒంటరి మహిళలుగా కుటుంబ భారాన్ని మోస్తు జీవిస్తున్నామన్నారు. మా సంక్షేమం కోసం ప్రభుత్వం పెన్షన్ 3వేల రూపాయలు, అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి 35కేజీల బియ్యాన్ని అందించాలన్నారు. భర్త విడిచిపెట్టిన వారికి, పెళ్లికానివారికి పెన్షన్లు మంజూరుచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒంటరి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం, అధికారులు పరిష్కరించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్‌ఛార్జి తహశీల్దార్ ఆర్ సాయికృష్ణకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జి మరియమ్మ, జి స్వర్ణలత, కె పుణ్యవతి, తదితరులు పాల్గొన్నారు.