విజయనగరం

ముస్లిం మహిళలు ఆర్థిక పరిపుష్టిని పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, మార్చి 13: ముస్లిం మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకోవాలని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. స్థానిక మసీదు సమీపంలో ముస్లిం యువతలకు స్కిల్స్ డవలప్‌మెంట్ శిక్షణాశిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం మహిళలకు ప్రభుత్వం పలురకాలైన పథకాలను అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకోవాలన్నారు. అలాగే యువకులకు ఉపాధి మార్గాలను కల్పించాలని మైనార్టీస్ కార్పోరేషన్ సంస్థ అధికారులను కోరారు. సాధీఖానా మరమ్మతులకు 30లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎక్కువగా బ్యాంకులలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వారు రుణాలు అందించేందుకు ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. బొబ్బిలి స్టేట్ బ్యాంకు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మైనార్టీలకు ఎక్కువగా రుణాలు అందించాలని కోరారు. అలాగే వీరు వినియోగిస్తున్న శ్మశానవాటిక అభివృద్ధికి 15లక్షల రూపాయలు మంజూరుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రాంగణం అధికారిణి, శిక్షకురాలు నిర్మల మాట్లాడుతూ మూడునెలలపాటు ఈ శిక్షణ ఉంటుందని, శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు, కమిషనర్ శంకరరావు, మైనార్టీ కార్పోరేషన్ ఇడీ షంసుద్ధీన్, జిల్లా అధికారిణి అన్నపూర్ణ, కమిషనర్ శంకరరావు, వార్డుకౌన్సిలర్ హైమావతి, ముస్లిం సంఘం నాయకులు భాష, రఫీ, తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు కోటి 19లక్షల రూపాయలతో ఉపకార వేతనాలు
బొబ్బిలి, మార్చి 13: జిల్లాలో మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు కోటి 19లక్షల రూపాయలు ఉపకార వేతనాల కింద మంజూరైందని జిల్లా మైనార్టీ సంఘం అధికారిణి అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 75శాతం హాజరు ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన విదేశీయ విద్యాపథకం ద్వారా 10లక్షల రూపాయలు కేటాయించామన్నారు. వీరు విదేశాలలో సైతం చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు. దుల్హాన్ పథకం ద్వారా మైనార్టీలకు చెందిన అవివాహితులకు, బాలికల వివాహాం కోసం 50వేల రూపాయల చొప్పున ప్రోత్సాహాకాలను అందిస్తున్నామన్నారు. ఏపీ ఇపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇంతవరకు 28లక్షల రూపాయలు అందించామని, మరో 7లక్షల రూపాయలు అందించాల్సి ఉందన్నారు. షాధీఖానా మరమ్మతులకు, ప్రహారీగోడ నిర్మాణాలకు నిదులు మంజూరుచేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ విద్యోన్నతి పథకం ద్వారా నిరుద్యోగ మైనార్టీ అభ్యర్థులకు సివిల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, తదితర పోటీపరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈపథకాన్ని మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మైనార్టీల సంక్షేమానికి 1102కోట్ల రూపాయలు కేటాయింపు
బొబ్బిలి, మార్చి 13: ఈ ఆర్థిక సంవత్సరానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా 1102కోట్ల రూపాయలతో మైనార్టీలకు వివిధ రకాల పథకాలు, వారి సంక్షేమం కోసం వ్యయం చేయనున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇడీ షంసుద్ధీన్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్‌లో 830కోట్లు కేటాయించారని, ఈ ఏడాది 1102కోట్లు కేటాయించారన్నారు. వీటి ద్వారా వారికి రుణాలు, వారి సంక్షేమానికి అవసరమైన అన్నిరకాలైన సౌకర్యాలు, పథకాలను అందిస్తున్నామన్నారు. కార్పోరేషన్ ద్వారా మైనార్టీ ప్రజలకు 3రకాల సేవలను అందిస్తున్నామన్నారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. ఐఏఎస్, ఆర్‌బిఐ, తదితర సంఘాలలో శిక్షణాశిబిరాలను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత ఏడాది శిక్షణా శిబిరాల కోసం 8కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు వారికి ఉపకార వేతనాలను అందించేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ సిద్ధంగా ఉందన్నారు. గత ఏడాది 600మంది విద్యార్థులకు 12లక్షల రూపాయల ఉపకారవేతనాలు అందించామని, ఈ ఏడాది సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. మైనార్టీలలో 5రకాల వారు ఉన్నారని, వారందరికీ పథకాలను వర్తింపచేస్తామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకోవాలని కోరారు. గత ఏడాది కోటి రూపాయల రుణ సౌకర్యాలను కల్పించామన్నారు.