విజయనగరం

జోరుగా కె.జి.పూడి-బొద్దాం రహదారి వెడల్పు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, మార్చి 13: మండలంలోని కొండగంగుబూడి నుంచి బొద్దాం వరకు రోడ్డు వెడల్పు పనులు జోరుగా సాగుతున్నాయి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులు పూర్తయితే ఎస్.కోట, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ రిజర్వాయర్‌ను చూసేందుకు ఈ రోడ్డు మార్గం సుగమం కానుంది. ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్‌ను తిలకించేందుకు వెళ్ళాలంటే కొత్తవలస మీదుగా దేవరాపల్లి వెళ్లడం ఒక్కటే మార్గం. ఇకపై బొద్దాం నుంచి కె.జి.పూడి, చింతలపూడి మీదుగా రైవాడ వెళ్లేందుకు శారదా నదిపై రెండు చోట్ల అనువైన వంతెనలను కూడా నిర్మించడంతో ఈ రహదారి అడ్డదారిగా పనికి వస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం కెజి పూడి సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల దగ్గర నుండి రోడ్డు పనులు ప్రారంభం కాగా మంగళవారం నాటికి ఎస్.కోట, సీతారాంపురం జంక్షన్ దాటి ముందుకు సాగుతుండగా అవసరమైన చోట వెడల్పు చేయడమేకాకుండా పూర్తిస్థాయిలో తారురోడ్డు పనులు చేపడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణలో పనులు నాణ్యతగా జరుగుతుండడంతో ప్రయాణాలు సురక్షితంగా జరుగుతాయనడంతో సందేహం లేదు.

దేవాడలో దగ్ధమైన నీలగిరితోటలు
కొత్తవలస, మార్చి 13: మండలంలోని దేవాడ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు నాలుగు ఎకరాల వరకు నీలగిరి తోటలు దగ్థమయ్యాయని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, ప్రమాదానికి గురైన రైతుల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఆర్ ఐ తెలిపారు. గత పది రోజుల్లో మండలంలో రోజుకోచోట అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. గొర్రెలు, మేకలు పశువులు కాపర్లు చుట్ట, బీడి, సిగిరెట్ వంటివి కాల్చుతూ వాటిని అశ్రద్దగా పారవేయడం వలన ఈ అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆర్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్వో, విఆర్‌ఎలు పాల్గొన్నారు.

రైల్వే జోన్ రాకపోవడంతో కొత్తవలసకు భారీ నష్టం
* ఆందోళన చెందుతున్న వర్తక, వ్యాపార, ఉద్యోగ సంఘాలు
కొత్తవలస, మార్చి 13: విభజన హామీ చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేనని ప్రకటించడంతో వర్తక, వ్యాపార, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. రైల్వే జోన్ రాకపోవడం వలన కొత్తవలస రైల్వే జంక్షన్ ఆర్థికంగా చాలా నష్టపోతుందని, అదే విధంగా శృంగవరపుకోట నియోజకవర్గంలోని మూడు మండలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వర్తక సంఘాలు పేర్కొన్నాయి. కొత్తవలస కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి అధిక మొత్తంలో మామిడి, ఇతర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అదే విధంగా రైల్వే రాబడులు 35 శాతం వరకు ఆదాయాన్నిసమకూర్చుతున్న కొత్తవలస-కిరండోల్‌కు రెండవ లైన్ పనులు చేపడుతున్న తరుణంలో జోన్ ప్రకటన ఆగిపోయింది. దీంతో ఈ పనులపై నీలినీడలు అలుముకుంటాయేమోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తవలస కేంద్రంగా పలు పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎం ఒయులు కుదుర్చుకున్నాయి. రైల్వే జోన్‌రాకపోవడంతో పరిశ్రమల స్థాపన కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఉద్యోగ సంఘ నాయకులు సత్యారావు, ఈశ్వరరావు అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటపై కేంద్రం ప్రభుత్వం నిలబెట్టుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరు కలసి పోరాడాలని వారు పిలుపునిచ్చారు.