విజయనగరం

చెత్త నుంచి సంపద కేంద్రం స్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 13: మండలంలోని దావాలపేట గ్రామపంచాయతీకి సంబంధించిన చెత్త నుంచి సంపద కేంద్రం స్థలాన్ని గజపతినగరం తహశీల్దార్ బి.శేషగిరిరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో సంపద కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలు సమకూర్చామని తెలిపారు. అయితే దావాలపేట పంచాయతీ శివారు బూడిపేట గ్రామం పరిధిలో మంజూరు చేసిన స్థలానికి సంబంధించి ఆ గ్రామానికి చెందిన టి. సత్యవతి అధికారులకు నోటీసులు అందజేసిందని అన్నారు. ఈ మేరకు సర్వేయర్ రాజుతో కలసి స్థల పరిశీలన జరపగా ఇది ప్రభుత్వ స్థలమేనని చెప్పారు. ఈ ప్రదేశంలో కేంద్రాన్ని నిర్మించుకోవచ్చునని సంబంధిత నివేదిక పంపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వి ఆర్వో హరిబాబు పాల్గొన్నారు.

వైభవంగా సంపూర్ణ వేదపారాయణం
గజపతినగరం, మార్చి 13: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం సంపూర్ణ వేదపారాయణం తిరుమల తిరుపతి దేవస్థానం సూపరువైజరు గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనాపాఠీ ఆధ్వర్యంలో వేదపండితులు నిర్వహించారు. జిల్లాలో గల 13మంది వేదపండితులు ఈ పారాయణంలో పాల్గొన్నారు. మూడు రోజులు పాటు జరిగే ఈ పారాయణ సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు జరుపుతామని సూపరువైజర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

రాజరాజేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు
బొండపల్లి, మార్చి 13: మండలంలోని దేవుపల్లి గ్రామంలో గల రాజరాజేశ్వరీదేవికి మంగళవారం పాల్గొణ శుక్ల ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దూసి శ్రీధర శర్మ విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ హేవలంభి నామ సంవత్సరంలో పాల్గొణ శుక్ల ఏకాదశి ఆఖరిదని ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు, రుణబాధలు తొలగుతాయని అన్నారు. ఆలయ ధర్మకర్త ఆదుర్తి రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, భోగాపురం, డెంకాడ తదితర ప్రాంతాల ప్రజలు విశేష సంఖ్యలో వచ్చారని తెలిపారు.