విజయనగరం

కోర్టు భవన సముదాయాలకు సుప్రీం జడ్జి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మార్చి 17: పార్వతీపురంలోని నూతనంగారూ.5.26కోట్లతో నిర్మించిన కోర్టు భవనాలకు శనివారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, రెండవ అదనపున్యాయమూర్తికోర్టు, పిడియం కోర్టులతో పాటు రెండు బార్ రూమ్‌లను ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజని, హెకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌లు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశలతో పాటు ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా రెండవ అదనపున్యాయమూర్తి హెచ్. చంద్రశేఖర్, సీనియర్ సివిల్ జడ్జి సాధుబాబు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ జి.గంగరాజు, ఎజె ఎఫ్ సి ఎం సిహెచ్ మధుబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు, ఎ ఎస్పీ దీపికా పాటిల్, ఒయస్డీ పాటిల్ , ఆర్డీవో బి.సుదర్శనదొర తో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్ వి రమణతో పాటు పలువురు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

న్యాయమూర్తులకు ఘన సన్మానాలు
పార్వతీపురం, మార్చి 17: పార్వతీపురం విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘణంగాసన్మానించారు. ఈసందర్బంగా జస్టిస్ రమణకు బొబ్బిలి వీణను అందించారు. ఈకార్యక్రమంలో బార్ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు సన్మానించారు. అలాగే ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రజనిని న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చీకటి మానవేంద్రనాద్ రాయ్‌ను కోర్టు ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం కోర్టు కార్యాలయ సూపరింటెండెంట్ ఆనందరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయశాఖ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.

జిల్లాలో 722 సిసి కెమెరాలు ఏర్పాటుకు చర్యలు
పార్వతీపురం, మార్చి 17: జిల్లాలో విజయనగరం,బొబ్బిలి, పార్వతీపురం లలో ఈనెలాఖరునాటికి వివిధ ప్రాంతాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో 722 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. శనివారం ఆయన పార్వతీపురం వచ్చిన సందర్భకంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈకెమెరాల ద్వారా ప్రతి వ్యక్తి కదలిక గమనించడానికి ఆస్కారం ఉందన్నారు. వీడియో రికార్డింగ్‌తో పాటు నేరాల అదుపునకు తగిన ఆధారాలు లభ్యమవుతాయనాన్నారు. వాహనం నెంబర్ ప్లేటు కొడితే ఎన్ని సిసి కెమెరాలు దాటి వెళుతుందోకూడా తెలుస్తుందన్నారు. ట్రాఫిక్, డిఫెన్సు, అడ్వాన్సుడ్ బేస్ట్ పోలీసింగ్ వంటి వాటిలో ఈకెమెరాలు బాగా దోహదపడతాయన్నారు. రెగ్యులేట్ వైలేట్ డిటెక్షన్ వంటి వాటికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లాలోని 3వేల ప్రైవేటు కెమెరాలున్నా అవి కొన్నిచోట్లకే పరిమితం అవుతున్నాయన్నారు. ఇకమీదట పోలీసుశాఖ ఏర్పాటు చేసే కెమెరాల ద్వారా నేరాలు అదుపునకు ఎంతో ప్రయోజనం చేకూరతాయన్నారు. ఇదిలా ఉండగా ఒడిసా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు సంబంధించిన పోలీసు అవుట్ పోస్టు సాలూరునుండే మోనిటర్ చేస్తున్నామన్నారు. కొఠియా గ్రామాలకు విద్య, వైద్యం వంటివి ఎపి నుండే అందుతున్నాయన్నారు.