విజయనగరం

నేడే ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), మార్చి 17: ప్రతీ ఏడాది ఉగాది వేడుకలను గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం ఉగాది సందర్భంగా మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో శనివారం నాటికే పండగ వాతావరణం నెలకొంది. కొత్త సంవత్సరం సందర్భంగా పొలాల్లో కొత్తనాగళ్లతో దుక్కులు చేపట్టడం, తదితర కార్యక్రమాలను రైతులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా విశ్వబ్రాహ్మణుల వద్ద రైతులు నాగళ్లను తయారుచేయించుకుంటారు. తెల్లవారుజామున వీటికి పూజలు చేసి పొలాలకు తీసుకువెళతారు. ఉగాది పండగను ప్రతీ ఏటా పిరిడి, పక్కి, మెట్టవలస, పెంట, అలజంగి, కోమటిపల్లి, చింతాడ, తదితర గ్రామాల్లో భారీగా నిర్వహిస్తారు. ఆయా ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తారు. ఏదీ ఏమైన ఉగాది పండగకు కొత్తవస్త్రాలను ధరించి ఘనంగా జరుపుకోవడం విశేషం.

అలజంగి సీబీఎం పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలు
బొబ్బిలి(రూరల్), మార్చి 17: మండలం అలజంగి సీబీఎం పాఠశాలలో శనివారం ఉగాది వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె కృష్ణదాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండగను ప్రతీ ఒక్కరూ ఘనంగా జరుపుకుని ఆనందంగా ఉండాలన్నారు. మనం- మన సంస్కృతి పట్ల ఆసక్తికనబర్చాలన్నారు. సాంప్రదాయ దుస్తులను ధరించి ప్రతీ ఒక్కరినీ ఆకర్షించుకునేవిధంగా ఉండాలన్నారు. విద్యార్థులు ఉగాది పండగ విశిష్టతను తెలుసుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అనంతరం సాంప్రదాయ దుస్తులలో చిన్నారులు, వ్యవసాయ పనులకు వెళుతున్న రైతులు, ఉగాది పచ్చడి పంపిణీ, ఎంకినాయుడు బావ, తదితర వేషధారణలలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో బహుళ ప్రయోజనాలు
మక్కువ, మార్చి 17: ప్రకృతి వ్యవసాయం ద్వారా బహుళ ప్రయోజనాలను పొందవచ్చునని బొబ్బిలి సబ్‌డివిజన్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు పి భానులత, బొబ్బిలి వ్యవసాయ అధికారి శ్యాంసుందర్‌లు పేర్కొన్నారు. మండలంలోని బట్టివలస, మార్కొండపుట్టి గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, అంతర్‌పంటలను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుళార్ధక ప్రయోజనాల విస్తరణ అధికారుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా బలిజిపేట, బొబ్బిలి, సీతానగరం, బాడంగి మండలాల ఎంపీఇఓలు, ఏఇఓలకు అందిస్తున్న శిక్షణలో భాగంగా బట్టివలస గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు అంతర్‌పంటలుగా సాగుచేస్తున్న వక్కలు, తమలపాకు, మిరియాలు, తదితర వాటిని పరిశీలించారు. అనంతరం అంతర్‌పంటల వలన రైతులు పొందుతున్న లాభాలను రైతు నుంచి తెలుసుకున్నారు. ఇదేవిధంగా ప్రతీ ఒక్క రైతు పంట పొలాల్లో అంతర్‌పంటలను సాగుచేసుకోవాలన్నారు. అదేవిధంగా మార్కొండపుట్టి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు. అర ఎకరం పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 23రకాల కూరగాయలను పోతుల దుర్గారావు అనే రైతు సాగుచేస్తున్నాడని, వీటిలో ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా సేంద్రీయ ఎరువులను వినియోగించి సాగుచేస్తున్నాడని, దీంతో అధిక లాభాలతోపాటు ఆరోగ్యకరమైన పంటను పొందుతున్నామని రైతు దుర్గారావు పేర్కొన్నారు. పెదగైశి గ్రామానికి చెందిన రామకృష్ణ అనే రైతు పెర్టిలైషన్ విధానం ద్వారా ద్రవజీవామృతం, జీవామృతాలతో పామాయిల్ మొక్కలకు సాగుచేయడం వలన అధిక లాభాలను సాధించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్కువ వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు, ఎంపీఇఓలు, రైతులు పాల్గొన్నారు.