విజయనగరం

గ్రామాల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన్లకు కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 20: జిల్లాలోని అన్ని గ్రామాల్లో కొళాయి కనెక్షన్లు లేని చోట్ల ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాల్లో సర్వే కోసం ఏజెన్సీని నియమించారు. ఈ ఏజెన్సీ సర్వే చేసి రెండు నెలల్లో నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. కాగా, జిల్లాలో రూ.1074 కోట్లతో 2763 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ (హైబ్రిడ్ యాన్యువటి మోడ్) ప్రతిపాదనలు చేసిన విషయం విధితమే. జిల్లాలో మొత్తం జనాభా 24 లక్షలు కాగా, గ్రామీణ ప్రాంత జనాభా 18 లక్షల వరకు ఉంది. ఈ 18 లక్షల జనాభా నివసిస్తున్న ప్రాంతాల్లో దశల వారీగా ఇంటింటికీ కొళాయి కనెక్షన్ అందజేయనున్నారు. డిపిఆర్ కోసం ఇన్‌ఫ్రారెడ్ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. తొలి విడతగా వెయ్యి గ్రామాల్లో ఒక్కొ ఇంటికి 55 లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. జిల్లాలో తీరప్రాంతంలో ఉప్పునీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలు తక్కువగానే ఉన్నాయి. భూగర్భజలాలు కూడా సంతృప్తికరంగా ఉన్నందున వేసవిలో నీటి ఎద్దడి ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి తెలిపారు. ఏది ఏమైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌కు త్వరలోనే మోక్షం కలగనుంది.

కుటుంబ పెద్ద దిక్కుగా సిఎం సహాయనిధి ఉపయోగపడుతుంది
కొత్తవలస,మార్చి 20: మండలంలో కంటకాపల్లి గ్రామానికి చెందిన మాడుగుల శ్రావణికీ సిఎం సహాయ నిధి నుండి వచ్చిన 50వేల రూపాయల చెక్కును ఎంపిపి పొలమరశెట్టి రాజన్న మండల టిడిపి అధ్యక్షులు కోళ్ల శ్రీనుతో కలసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఆర్థికభరోసాను ఇస్తూ ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు సిఎం సహాయనిధి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే సిఎం రిలీఫ్ ఫండ్ నుండి 50వేల రూపాయలు మాడుగుల శ్రావణి కుటుంబానికి మంజూరు చేయించారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క శాసనసభ్యులు తీసుకురానన్ని నిధులు సిఎం రిలీఫ్ ఫండ్ నుండి లలితకుమారి తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రత్నాజీ, కొరుప్రోలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
బొండపల్లి, మార్చి 20: గజపతినగరం నియోజకవర్గం పరిధిలో గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని బొండపల్లి విద్యుత్‌శాఖ ఎఇ కాశీబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు చొరవతో సుమారు 50లక్షల ఖర్చుతో నూతన విద్యుత్ సరఫరాకు అదనపులైన్లు చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా గర్భాం నుంచి గజపతినగరం మండలం, అలాగే గర్భాం నుంచి దత్తిరాజేరు మండలం, గజపతినగరం మండలం నుంచి బొండపల్లి మండలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్‌దయాల్ నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే కృషితో విద్యుత్ అంతరాయంలో లో- ఓల్టేజీ సమస్యలు, సాంకేతిక సమస్యలతో ప్రజలు అవస్థలు పడకుండా నిరంతర విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని ముద్దూరు, పాతపనసలపాడు, కొత్తపనసలపాడు గ్రామాలలో విద్యుత్ సమస్యలు తీర్చేందుకు 14లక్షల ఖర్చుతో విద్యుత్‌లైన్లు ఆధునీకరించడం జరుగుతుందని చెప్పారు.