విజయనగరం

వైభవంగా సుందరాకాండ పారాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 20: సీతారామస్వామి ఆలయంలో మహిళలచే నిర్వహించిన సుందరాకాండ పారాయణం వైభవంగా జరిగింది. మంగళవారం సీతారామస్వామి వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆలయంలో సామవేద పారాయణదారు ఎం. వి. ఎస్.కె. శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7గంటలకు నిత్యార్చనలు, మండప పునఃపూజలు, మంగళాశాసనం తదితర కార్యక్రమాలు జరిపారు. ఉదయం 11గంటల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సుందరాకాండ పారాయణంతో ఆధ్యాత్మికత చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేదుల భువనేశ్వరప్రసాదశర్మ, ఆధ్వర్యంలో సాయంత్రం 6గంటలకు మండప పునఃపూజలు, నిత్య హోమాలు, మంగళాశాసనం, తీర్థ ప్రసాదగోష్టి జరిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధనకు తాడ్డి నిరాహారదీక్ష
గజపతినగరం, మార్చి 20: ప్రత్యేక హోదా సాధనకోసం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు మనవడు తాడ్డి యువసేన అధ్యక్షుడు డాక్టర్ తాడ్డి జశ్వంతనాయుడు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నిరవదిక నిరాహారదీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని డాక్టర్ జశ్వంత్‌నాయుడు మంగళవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. గజపతినగరం నాలుగు రోడ్లు కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఇక ప్రత్యేక స్థావరం వద్ద బుధవారం ఉదయం 9గంటలకు దీక్షలో కూర్చుంటామని తెలిపారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని, హోదాతోనే రాష్ట్ర ప్రజలకు విభజన కష్టాలు దూరమవుతాయని చెప్పారు. తనదీక్షకు ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, సామాజిక బాధ్యతగా భావించి దీక్షకు నడుం బిగిస్తున్నానని చెప్పారు. ఈ దీక్షకు అన్ని వర్గాలు, సంఘాలు మద్దతు పలుకుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. తన దీక్షకు ఇప్పటికే సామాజిక ఉద్యమనేత చలసాని శ్రీనివాస్, సినీహీరో శివాజీలు మద్దతు తెలిపారని అన్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

కౌమారదశ ఆరోగ్యంపై అవగాహన పెరగాలి
వేపాడ, మార్చి 20: కౌమారదశలో ఆరోగ్యంపై బాలబాలికలకు అవగాహన పెరగాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ గాయత్రిదేవి అన్నారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న క్లీనిక్ సేవలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్లీనిక్ సేవలు విస్తృతానికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. కౌమార బాలబాలికల రక్తహీనతను అధిగమించేందుకు ప్రతివారం పాఠశాలలో ఇస్తున్న ఐరెన్ పోలిక్ ఆసిడ్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. రుతుశ్రావ సమయంలో ప్రతి కౌమారబాలిక తప్పనిసరిగా శానటరీ న్యాప్‌కీన్స్ వినియోగించేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఇక నుంచి కౌమార బాలబాలికల ఆరోగ్య సేవలు విస్తృత పరచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ రమేష్‌బాబు, కౌన్సిలర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.