విజయనగరం

ప్రత్యేక హోదా కోసం రహదారి దిగ్భందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), మార్చి 22: ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదంతో వామపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్కెక్కాయి. అంతర్రాష్ట్ర రహదారుల దిగ్భందంలో భాగంగా గురువారం పార్వతీపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీ ఎం ఆద్వర్యంలో రోడ్డు దిగ్భందం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీ ఎం నాయకులు రెడ్డి శ్రీరామమూర్తి మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి పుట్టగతులుండవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే వామపక్షాలను ప్రజాసంఘాలను ఏకతాటిపై ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాటం ఆగదన్నారు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులు రాజశేఖర్ మట్టి, నీరు పట్టుకొని నిరసన తెలిపారు. మీరిచ్చిన మట్టి, నీరు తీసుకొని మా ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీ ఎం నాయకులు జివి రమణ, పాకల సన్యాసి, సి ఐటియు, వర్తక, కళాసీ సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. మోడిని విమర్శిస్తూ నినాదాలు చేశారు. కాంప్లెక్స్ నుండి పాతబస్టాండు వరకు ర్యాలీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి, వైస్ చైర్మన్ బెలగాం జయబాబు, ఎంపీపీ హరిప్రియ, బార్నాల సీతారాం, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బిసి వెలమ సంక్షేమ సంఘ పటిష్టానికి గ్రామ కమిటీల ఏర్పాటు
పార్వతీపురం, మార్చి 22: వెలమ సంక్షేమ సంఘ (బిసి) పటిష్టానికి గ్రామ స్థాయిలో కమిటీలను నియమించే ప్రక్రియను ఆ సంఘ రాష్టన్రాయకులు, జిల్లానాయకులు చేపడుతున్నారు. ఈమేరకు ఈనెల 21,22తేదీల్లో పార్వతీపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆ సంఘ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వెంకంపేట, పెదబొండపల్లి, బాలగుడబ, గంగాపురం, కోరి, కవిటిభద్ర, ములగలు, తేలునాయుడువలస, తాళ్లబురిడి, వెంకటరాయుడుపేట, పుట్టూరు, జమదాల, బందలుప్పి తదితర గ్రామాల్లో విస్తృతంగా సంఘనాయకులు విస్తృతంగా పర్యటించి గ్రామసంఘ కమిటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్వతీపురం మండల స్థాయి కమిటీలను ఈనెల 23వ తేదీ ఏర్పాటు కోసం పార్వతీపురంలోని భాస్కర్ కళాశాల నందు సమావేశం నిర్వహించడానికి సంఘ నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కొప్పలవెలమ కులస్థులంతా హాజరుకావాలని నాయకులు కోరారు. గ్రామకమిటీల ఏర్పాటు కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కో ఆర్డినేటర్ గొట్టాపు చిన్నంనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేళాపుశ్రీహరినాయుడు, రాష్ట్ర సంఘ బాధ్యులు చుక్క భాస్కరరావు, అమరపుసూర్యనారాయణల సారధ్యంలో జరిగిన ఈకార్యక్రమంలో సంఘనాయకులు చొక్కాపువెంకటరమణ, చెల్లారపురమేష్, మరిశర్ల కార్తీక్, గొట్టాపుతవిటినాయుడు, దొగ్గమోహన్, జాగాన రవి, దత్తిశ్రీను, జి.రామారావు, బడే సుగుణాకరరావు, చింత భాస్కరరావు, దత్తి కూర్మినాయుడు,మర్రాపురామారావు,గుల్లరామినాయుడు,గొట్టాపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

కాగిత రహిత పాలన విధానం ఎంతో ప్రయోజనం
పార్వతీపురం, మార్చి 22: కాగిత రహిత ఆర్థిక లావాదేవీలు వచ్చేనెల 1 వతేదీ నుండి రాష్ట్రంలో అమలు చేయనున్నందున ఇది ఎంతో ప్రయోజనకరమని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశం హాలులో పార్వతీపురం, సాలూరు పరిధిలోగల డిడివోలకు కాంప్రహెన్షివ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సి ఎఫ్ ఎం ఎస్) విధానం అమలుకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి హాజరైన పీవోడాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కాగిత రహిత విధానం ఇప్పటికే దేశంలోని హిమాలచల్‌ప్రదేశ్‌లో అమలులో ఉందన్నారు.అందువల్ల ఈవిధానం వల్ల కలిగే ప్రయోజనం భవిష్యత్తులో ఎంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కార్యాలయ బిల్లులు ఇతర అంశాలలో ఈవిధానం అమలుకు నిర్వహించే అవగాహన సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సహాయ ఖజానాధికారి నాయుడు జగన్నాథం మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరించనున్న సి ఎఫ్ ఎం ఎస్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకుని కాగిత రహిత బిల్లులు రూపకల్పనలో ఉద్యోగులు కీలక భూమిక పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈవిధానం గురించి డిడివోల స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. అదేవిధంగా 23వ తేదీన కూడా బొబ్బిలి, తెర్లాం, కురుపాం ఖజానాధికారుల పరిధిలోని డిడివోలకు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సి ఎఫ్ ఎం ఎస్ అవగాహన శిక్షణ కార్యక్రమంపై పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమాన్ని ఉప ఖజానాధికారి కళ్యాణ చక్రవర్తి కల్పించారు.

సెల్ టవర్ మాకొద్దు
పార్వతీపురం (రూరల్), మార్చి 22: స్థానిక రెండో వార్డులో ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్ వద్దని అక్కడ ప్రజలు గురువారం ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్ బార్నాల సీతారాం ఆద్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వారు మాట్లాడుతూ జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం సరికాదని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని వారు కోరారు. అధికారులు ప్రజల బాగుగోలు చూడాలన్నారు. అంతే కాని వారి వినాశనాన్ని కోరకూడదన్నారు. సెల్ టవర్ వలన పలు రోగాలు వస్తాయన్నారు. తక్షణమే విరమించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.