విజయనగరం

ప్రత్యేక హోదాపై టిడిపి నిరసన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, మార్చి 22: ప్రత్యేక హోదా సాధనకై టిడిపి ఆధ్వర్యంలో గురువారం వేపాడలో నిరసన దీక్ష చేపట్టారు. దివంగత ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన దీక్షలో కూర్చున్నారు. అనంతరం దేశం నాయకులు మాట్లాడుతూ సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి 3,550కోట్లు, శివాజీ విగ్రహానికి 2,500కోట్లు, గుజరాత్‌లో బులెట్ ట్రైన్ ఏర్పాటుకోసం లక్ష కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి మాత్రం చెంబుడు నీళ్లు, చేట, మట్టిమాత్రమే ఇచ్చి తన పక్షపాత ధోరణి ప్రదర్శించారని అన్నారు.ప్రజా ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి దాసరి లక్ష్మి, దేశం నాయకులు గోగాడ జగన్నాథం నాయుడు, గుమ్మడి భారతి, నాగభూషణం, రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
వేపాడ, మార్చి 22: రాష్ట్ర విభజనలో తీవ్రంగా నష్టపోయిన ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎపి దళిత కూలీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడి అచ్చారావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుగోలుగా విభజిస్తే బిజెపి విభజన హమీలు తుంగలో తొక్కిందని అన్నారు. మొన్నటి వరకు ప్రత్యేక ప్యాకేజీ సంజీవని అన్న టిడిపి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని కొంగజపం చేయడంపై ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బిజెపి, టిడిపిలకు ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యదర్శి మరియాదాస్, ప్రకాశం, గంగాధర్‌లు పాల్గొన్నారు.

జాతీయ ప్రతిభా పారితోషకానికి అప్పారావు ఎంపిక
బొబ్బిలి(రూరల్), మార్చి 22: ప్రతీ ఒక్కరూ కష్టపడి చదివితే ఎంతో అభివృద్ధి చెందుతారని మండలం కృష్ణాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబా అన్నారు. ఈమేరకు జాతీయ ప్రతిభా పారితోషకానికి ఎంపికైన అప్పారావును పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం హెచ్ ఎం సాయిబాబా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చక్కగా విద్యను అభ్యసించి ఇటువంటి పారితోషకాలను అందుకుని ఉపాధ్యాయులకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం చైతన్యసేవా సంఘం అధ్యక్షులు చుక్క శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి చదివిన వారికి భవిష్యత్ ఉంటుందన్నారు. ఉపాధ్యాయుల సూచనలు, సలహాలను విద్యార్థులు విధిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామ్మూర్తి, వెంకట ప్రసాద్, అప్పారావు, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు ఉదృతం
రామభద్రపురం, మార్చి 22: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు బలస శ్రీను తెలిపారు. గురువారం రామభద్రపురంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అన్ని రంగాల్లో వెనుకబడిన ఆంధ్రరాష్ట్రానికి న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఇప్పటికైన అన్నిరంగాల్లో వెనుకబడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.