విజయనగరం

1 నుంచి క్షయవ్యాధిగ్రస్తులకు రూ.500 పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 23: జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని డిఎంహెచ్‌ఒ డాక్టర్ వి.వెంకటరావు అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధికి సంబంధించి 2017లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3557 కేసులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 310 కేసులు నమోదయ్యాయన్నారు. 2018లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 650 కేసులు నమోదైనట్టు ఆయన వివరించారు. కాగా, హెచ్‌ఐవి రోగులకు క్షయ తొందరగా వ్యాప్తి చెందుతుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గినపుడు తుంపర్ల ద్వారా ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. రెండు వారాల వ్యవధిలో దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు గల వ్యక్తులు రోగ నిర్ధారణ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో అత్యాదునిక టిబి నిర్ధారణ యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి క్షయ వ్యాధి నిర్ధారణ చేసిన వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రూ.500 ప్రభుత్వం అందజేస్తుందన్నారు. టిబి యూనిట్ వైద్యాధికారి క్షయ వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం టిబి వ్యాధిగ్రస్తులకు ఖరీదైన మందులు సరఫరా చేస్తుందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కిశోర్‌కుమార్, అడిషనల్ డిఎంహెచ్‌ఒ డాక్టర్ పి.పద్మజ, వైద్యాధికారి విజయకుమారి, డాక్టర్ బాలమురళికృష్ణ, జిల్లా మాస్ మీడియా అధికారి కె.లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.