విజయనగరం

నేడు కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 23: ప్రత్యేక హోదా కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసినట్టు టిడిపి నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు మాట్లాడుతూ బిజెపి మిత్ర బంధం మరచి తెలుగువారికి ద్రోహం చేస్తుందన్నారు. బిజెపి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఇబ్బందులను చూసి ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారన్నారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ వైకాపాతో బిజెపి చీకటి ఒప్పందాలు చేసుకొని పథకం ప్రకారం తెలుగువారికి ద్రోహం చేస్తుందని విమర్శించారు. ఇదిలా ఉండగా పార్లమెంట్‌లో ప్రధానిపై అవిశ్వాస తీర్మాణం చర్చకు రాకుండా తెరాస, అన్నా డిఎంకెలను కేంద్రం అడ్డుపెట్టుకుంటుందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మాణాన్ని చర్చకు పెట్టాలన్నారు.అవిశ్వాసతీర్మాణంపై చర్చ పెడితే ఎక్కడ వ్యతిరేక ఓటు వస్తుందోనన్న భయంతోనే చర్చ జరపకుండా వాయిదా వేస్తున్నారన్నారు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొడానికి ఎన్నో పార్టీలు ముందుకు వచ్చి అవిశ్వాస తీర్మాణంపై సంతకాలు చేశాయన్నారు. ఇదిలా ఉండగా మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పట్టణానికి వస్తున్న సందర్భంగా ఆయన పోరాటాలకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ శ్రేణులు కలసికట్టుగా ముందుకు రావాలన్నారు.
పట్టణంలో ర్యాలీ
మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పట్టణానికి వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు తెలిపారు. అశోక్‌గజపతిరాజు ఆ రోజు ఉదయం 9 గంటలకు సింహాచల దర్శనం చేసుకున్న అనంతరం తగరపువలస మీదుగా పట్టణానికి చేరుకుంటారన్నారు. ఎత్తు బ్రిడ్జి నుంచి కోట వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మూడులాంతర్ల వద్ద శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారన్నారు. అనంతరం గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి, రైల్వే స్టేషన్ మీదుగా అశోక్‌బంగ్లాకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బి.నరసింగరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎన్‌ఎం రాజు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు విజ్జపు ప్రసాద్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కర్రోతు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.