విజయనగరం

యుపిఎ-3తోనే ప్రత్యేక హోదా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా యుపిఎ-3తోనే సాధ్యపడుతుందని మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రత్యేక హోదా కోసం డాక్టర్ తాడ్డి జశ్వంత్‌నాయుడు చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతూ వసంత్‌కుమార్ ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు సిపిఎం మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా ఇచ్చాయని కానీ నింద మాత్రం కాంగ్రెస్‌పై పడిందని అన్నారు. ఉద్యమంచేస్తున్నపుడు ఉద్యమకారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టులు చేయించేవారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీలో ఏముందోగానీ కాసులకోసం కక్కుర్తిపడేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో యుపిఎ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎన్‌డి ఎ ప్రభుత్వం టిడిపిని కలిపి హోదా విషయంపై దొంగాట ఆడుతున్నారని విమర్శించారు. బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదని, ప్యాకేజీకి ఒప్పుకోకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రాలకు బుండేల్‌ఖండ్ వంటి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు, ప్రజలకు పన్ను రాయితీలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమలు అధికంగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. హోదాను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. హోదాకోసం జశ్వంత్‌నాయుడు చేస్తున్న నిరాహారదీక్ష యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. జశ్వంత్‌నాయుడు తీసుకున్న నిర్ణయం శుభపరిణామంగా అభివర్ణించారు. యువకల్లో ఇలాంటి దీక్షలు చైతన్యాన్ని నింపుతాయని చెప్పారు. వైకాపా జిల్లా కన్వీనర్ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ విభజన కష్టాలు, నష్టాలు అధిగమించి రాష్ట్ర అభివృద్దివైపు పయనించాలంటే ప్రత్యేక హోదా కల్పన తప్పదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హోదా విషయంలో నాటకాలాడుతుందని అన్నారు. అదే విధంగా సీనియర్ వైద్యులు డాక్టర్ బి. ఎస్. ఆర్.మూర్తి, డాక్టర్ వి.సూర్యనారాయణమూర్తి, డాక్టర్ వి.కృష్ణారావు, డాక్టర్ బెల్లాన నాగనరేంద్రలు జశ్వంత్‌నాయకుడుకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి గారతవుడు, మండల పార్టీ కన్వీనర్ బూడి వెంకటరావు, మాజీ ఎంపి డి.వి.జి. శంకరరావు, వైకాపా నాయకులు మండల సురేష్, కరణం ఆదినారాయణ, బెల్లాన త్రినాథరావు, దొగ్గదేవుడు నాయుడులు పాల్గొన్నారు.