విజయనగరం

1 నుంచి ఈ-బిల్లు విధానం అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 28: జిల్లాలోని మద్యం దుకాణదారులు మే 1 నుంచి ఈ-బిల్లు విధానాన్ని అమలు చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ ఎ శంభు ప్రసాద్ ఆదేశించారు. గురువారం స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో తనను కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు ద్వారా దీనిని అమలు చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నిబంధనలు ప్రకారం ఈ-బిల్లు ఇవ్వని మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే విజయనగరం-1,2, భోగాపురం, చీపురుపల్లి స్టేషన్లను సారా రహితంగా తీర్చిదిద్దామని అన్నారు. గజపతినగరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4-బి, 17గ్రామాలను సి-క్లాస్ గ్రామాలుగా గుర్తించామని, ఆయా గ్రామాలలో నవోదయం కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సులు, ర్యాలీలు జరుపుతున్నామని చెప్పారు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి సారా రహిత గ్రామాలుగా ప్రకటిస్తామని అన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ వై. భీమ్ రెడ్డి, ఎస్సై మాన్యాలు పాల్గొన్నారు.