విజయనగరం

ఆగాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 28: కల్యాణాలు, గృహప్రవేశాలు, గృహ నిర్మాణాలు ఇతర శుభకార్యక్రమాలకు శుక్రవారంతో తెరపడనుంది. శుక్రవౌడ్యమి ఈనెల 30నుంచి ప్రారంభమవుతుండటం, ఆ తరువాత ఆషాడమాసం వస్తున్న నేపథ్యంలో 29వ తేదీ ఒక్కటే చివర శుభముహుర్తంగా వేదపండితులు నిర్ణయించారు. మే రెండవ తేదీవరకు చిన్నాచితక కార్యక్రమాలు జరిపించుకోవచ్చని కొందరు పండితులు చెబుతున్నా చాలామంది 29వ తేదీ ముహుర్తాలకే వివిధ కార్యక్రమాలు ముగించుకుంటున్నారు. ఈనెల 30నుంచే జూన్ పదివరకు శుక్రవౌడ్యమి కొనసాగుతుండటంతో సుమారు నలభైరోజులపాటు శుభకార్యాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఆ తరువాత ఆషాడ మాసం రావటం కూడా శుభకార్యాలు జరపటానికి ఆటంకాలు కలుగుతున్నాయి. సుమారు మూడునెలల పాటు శుభముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. సాధారణంగా వేసవి వచ్చిందంటే పెళ్లిళ్ల సందడి చెప్పనలవి కాదు. మార్చిలో ప్రారంభమయ్యే పెళ్లిళ్లు జూన్‌నెల మొదటివారం వరకు కొనసాగేవి. మే నెలలో అయితే పెళ్లిళ్ల హడావుడి జోరుగా ఉండేది. కానీ ఈసారి శుక్రవౌడ్యమి రావటంతో మే నెల ప్రారంభం నుంచే ఏ శుభకార్యాలకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఈసారి చాలామంది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పెళ్లిళ్ల తతంగాన్ని ముగించేసారు. గృహ నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలను కూడా ఈ రెండునెలల్లో జోరుగా జరిపించేశారు. ఈనెల చివరి వారంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో ప్రతి ఊరు, ప్రతి వాడ సందడిగా, హడావుడిగా కనిపించింది. ఈనెల 24తోనే ఇంచుమించుగా పెళ్లిళ్లు పూర్తవగా పెట్టుడు ముహుర్తాలతో 29వ తేదీవరకు ఈ తంతు కొనసాగిస్తున్నారు. రెండవ తేదీతో అన్ని ముహుర్తాలు నిలచిపోవలసిందేనని పండితులు చెబుతున్నారు. తిరిగి ఆగస్టు12నుంచి 23వరకు కృష్ణా పుష్కరాలు మొదలవుతున్నాయి. పుష్కరాల కారణంగా ఆచారం ప్రకారం కృష్ణా నదీతర ప్రాంతాల్లో పెళ్లిళ్లు పెద్దగా జరిగే అవకాశం లేదని వేదబ్రాహ్మణుల సమాచారం. కృష్ణా పుష్కరాల తరువాతే శుభముహుర్తాలు మొదలవుతాయని, దసరా తరువాతే పెళ్లిళ్ల సీజన్ జోరందుకుంటుందని బ్రాహ్మణుల చెబుతున్నారు.
వెలవెలపోనున్న వ్యాపారాలు
వౌడ్యమి కారణంగా శుభకార్యక్రమాలు జరపుకునే అవకాశాలు లేకపోవటంతో వివిధ వ్యాపారాలు వెలవెలపోయే పరిస్థితి నెలకొంది. సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలకు జూనె నెల రెండవ వారం వరకు కల్యాణ మండపాలకు హౌస్‌ఫుల్ బుకింగ్ ఉండేది. గిరాకీని బట్టి కల్యాణ మండపాల ధరలు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా పెంచేసేవారు. కల్యాణమండపాలు లభించని వారు తప్పనిసరి స్థితిల్లో పాఠశాల మైదానాల్లో, ఇళ్ల వద్ద అరకొర వసతులతో పెళ్లిళ్లు జరిపించేవారు. కానీ ఈసారి వౌడ్యమి కారణంగా మే నెల ఆరంభం నుంచే కల్యాణమండపాలకు బుకింగులు లేకుండా పోయాయి. దాంతో సుమారు మూడునెలలు సిబ్బందికి పనిలేకుండా జీతాలు ఇవ్వవలసి వస్తోందని కల్యాణమండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేకపోవటంతో సన్నాయి మేళం, బ్యాండు, డెకరేషన్, లైటింగ్, వంటవాళ్లకు కూడా పనిలేకుండా పోయింది. సుమారు మూడునెలల పాటు జోరుగా జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో తమకు ఏడాది కాలం గడిచేదని, కానీ ఈసారి మూడాలు, ఆషాడమాసం, కృష్ణ పుష్కరాలు వరుసగా రావటంతో వ్యాపారులు, ఉపాధి లేకుండా పోతోందని వ్యాపారులు, వారిపై ఆధారపడి ఉన్న ఉద్యోగులు వాపోతున్నారు.
ఆర్టీసీ, రైల్వేల ఆదాయానికి దెబ్బ
శుభ ముహర్తాలు లేని కారణంగా మే నెల ఆరంభం నుంచి గతంతో పోలిస్తే ఈసారి ఆదాయం తగ్గుతుందని ఆర్టీసి, రైల్వే అధికారులు, ప్రైవేటు వాహన యజమానులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కారంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో ఆర్టీసికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించేంది. కొన్ని సందర్భాల్లో మిగతా తొమ్మిది నెలల లోటును ఈ మూడునెలల్లో పూడ్చుకునేందుకు అవకాశం లభించేది. రైళ్లలో కూడా రిజర్వేషన్ బోగీలలో వారం రోజుల ముందు కూడా బెర్తు లభించటం కష్టంగా ఉండేది. జనరల్ బోగీల పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదని, సీటు సంగతి అటుంచి నిలబడటానికి కూడా చోటు లభించని పరిస్థితులు ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలకు జోరుగా వ్యాపారం జరిగేది. టూరిస్టు బస్సులు, కార్లు, టాటి-ఎసిలకు తదితర వాహనాలకు బోలెడు డిమాండ్ ఉండేది. మామూలు రోజులతో పోలిస్తే ఈ సీజన్‌లో వాహనాల అద్దెలు ఇష్టారాజ్యంగా వసూలు చేసేవారు. కానీ సుమారు మూడునెలలపాటు శుభముహుర్తాలు లేకపోవటంతో వేసవి సెలవుల రద్దీ తప్ప పెళ్లిళ్లు, ఇతర శుభముహుర్తాల రద్దీ ఉండదని రైల్వే, ఆర్టీసి అధికారులు, ప్రైవేటు వాహనాల యజమానులు చెబుతున్నారు.