విజయనగరం

రైతుల కోసం గ్రామస్థాయి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 17: గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించడం రైతు కోసమేనని గజపతినగరం సబ్‌డివిజన్ వ్యవసాయ సంచాలకురాలు ఆర్. అన్నపూర్ణ అన్నారు. మంగళవారం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ 2018-19కి సంబంధించి ఖరీఫ్‌కు కావాల్సిన విత్తనాలు, యంత్రాలు, వివిధ పనిముట్లుకోసం గ్రామస్థాయిలో తెలుసుకుని ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. అదే విధంగా పచ్చిరొట్ట విత్తనాలు ఇంతవరకు రుణం తీసుకోని రైతుల జాబితా తయారు చేయడం, వ్యవసాయ యంత్రాలకు కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయడం, కౌలు రైతులను గుర్తించడం, జాయింట్ లైబుల్టీ గ్రూపులుగా తయారు చేయడం, వాటర్‌కేరింగ్ పైపులు, రైతులు జాబితా రూపొందించడం జరుగుతుందని అన్నారు. అలాగే డైరెక్ట్‌గా వరి యద, డ్రమ్‌సీడర్ విధానం, ఆధునిక పంటల విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. సూక్ష్మ బిందు సేధ్యంపైన ఉద్యానవనశాఖ, పశు సంవర్థకశాఖ, మార్కెటింగ్ శాఖ తదితర శాఖల సేవలపై రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు సహకరించాలని కోరారు. రోజుకో గ్రామంలో ఈ సభ నిర్వహిస్తామని చెప్పారు.
అక్షయ తృతీయకు విశేష గాధలు
* అక్షయ తృతీయపై ప్రత్యేక కథనం
గజపతినగరం, ఏప్రిల్ 17: అక్షాతీజ్ లేదా అక్షయతృతీయ అనే పండగను ప్రతి ఏడాది వైశాఖమాసంలోని శుక్లపక్షం మూడవరోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండగను(ఈ నెల 18వ తేదీ బుధవారం) జరుపుకుంటారు. ఈ పండగ రోజు కొందరు ఉపవాసం ఉంటారు, మరికొందరు దానధర్మాలు, మరికొందరు పితృదేవతలను స్మరించుకుంటారు. కానీ ఈ పండగ ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా? మిగిలిన పండగలకంటే ఈ పండగ ఎందుకంత ముఖ్యమో మీకు తెసుసా? అక్షయతృతీయకు సంబంధించి ఎన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్రేతాయుగ ప్రారంభంలో త్రేతాయుగం అక్షయతృతీయనాడే ప్రారంభమయిందని హిందూ మత గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. మానవ జాతికి సంబంధించి నాలుగు యుగాల గురించి హిందూ మతంలో ప్రస్తావన ఉంది. సత్యయుగం, త్రేతాయుగం, దోపరయుగం, కలియుగంగా వాటి గురించి వివరించారు. ప్రస్తుతం మనం కలియుగంలో నివసిస్తున్నాం. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు మూడు అవతారాలను ధరించాడు. త్రేతా అనగా మూడు అని అర్థం. వామనుడుగా ఐదవ అవతారం, పరశురాముడుగా ఆరవ అవతారం, అలాగే శ్రీరాముడుగా ఏడవ అవతారాన్ని ధరించాడు శ్రీమహావిష్ణువు. నర్ నారాయణ అనే విష్ణుమూర్తి అవతారాలు కూడా ఈ రోజునే చోటుచేసుకున్నాయి. నర్ నారాయణ అనే వారు కవలలు. ఈ సోదరులను శ్రీమహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. నరుడు అనగా మానవడు,నారాయుడు అనగా దేవుడు. నరనారాయణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారాలేనని పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీమహావిష్ణువు పరశురాముడుగా అక్షయతృతీయనాడే అవతరించాడని అంటారు. పరశురాముడు శ్రీమహావిష్ణువు తన ఆరవ అవతారాన్ని ధరించాడు. ఫృద్వీమాత అనగా భూదేవి ఆజ్ఞప్రకారం పరశురాముడు అవతారాన్ని ధరించాడు శ్రీమహావిష్ణువు, రాజ్యపాలకులు క్రూరులుగా మారినపుడు భూమాత ఈ విధంగా శ్రీమహావిష్ణువు ఆజ్ఞాపించింది. పెరిగిపోతున్న పాపపుభారాలను తగ్గించడానికి పరశురాముడుగా శ్రీమహావిష్ణువు అవతరించి క్రూరపు పాలనను అంతమొందించాడు. ఈరోజునే విఘ్నేశ్వరుడుకి వేదవ్యాసుడు మహాభారతాన్ని వివరించారు. వేదవ్యాసుడనే ప్రముఖ మహర్షి మహాభారతాన్ని రచించాడు. వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారతానికి అక్షర రూపం కల్పించాడు. ఆ విధంగా అక్షయతృతీయనాడే మహాభారతాన్ని వేద వ్యాసుడు వినియకుడుకి వివరించాలని పురాణాలు స్పష్టంచేస్తున్నాయి. భువిపై గంగ చేరిన రోజు సగరుని వంశానికి చెందిన వాడు భగీరధుడు. సగరునికి 60వేల మంది కుమారులు కలరు. ఈ వంశానికి చెందిన పూర్వీకులకు మరణం తరువాత ఆత్మశాంతి కలగకపోవడంతో భగీరధుడు వారి ఆత్మకు శాంతిని కలిగించేందుకు పవిత్రమైన గంగను భువిపైకి తీసుకువస్తానని తద్వారా వారి పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చు అని ప్రతిజ్ఞ చేస్తాడు. గంగను భువిపై తేవడంలో భగీరధుడు విజయం సాధించాడు. ఇది కూడా అక్షయతృతీయనాడే జరిగిందని పురాణాల కథనం కుబేరుడు తన నిధులను సమకూర్చుకున్నాడు. రాజులకు దేవుడైన కుభేరుడు అక్షయతృతీయనాడే నిధులను సమకూర్చుకున్నాడు. మహాభారతంలో యుధిష్టరుడు ఈరోజునే అక్షయ పాత్రను దక్కించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడు సుధాముడు పేదవాడు, కృష్ణుడుని కలవాలని అతను నిర్ణయించుకున్నాడు. అతని వద్ద ఏమీలేవు, కాసిన్ని అటుకులు మాత్రమే ఉన్నాయి. ఈ అటుకులను శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో స్వీకరించాడు. సుధాముడు ఇంటివద్దకు రాగానే వారి పూరిగుడెసె అంతఃపురంగా మారిపోయింది. ఆదిశంకరాచార్యుడు కనకధారస్తోత్రాన్ని పఠించిన రోజు 21శ్లోకాలు కలిగిన కనకదార స్తోత్రమనేది శ్రీమహాలక్ష్మిని స్తుతించే స్తోత్రం ఆదిశంకరాచార్యులు తన ఎనిమిదవ ఏటే సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఓ పేద బ్రాహ్మణ మహిళ ఇంటివద్దకు బిక్షకు వెళ్తాడు. తన వద్ద ఏమీ లేకపోవడంతో ఒక ఉసిరికాయను ఆమె భిక్షంగా వేస్తుంది. ఆమె కరుణకు ముచ్చటపడిన ఆదిశంకరాచార్యుడు లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోవడానికి కనకధార స్తోత్రాన్ని పఠిస్తాడు. ప్రసన్న లక్ష్మీమాత ప్రత్యక్షంకాగా ఈ పేద బ్రాహ్మణ మహిళను కరుణించమని కోరాడు. లక్ష్మీమాత ఆపేద మహిళ ఇంటిని సకల సంపదలతో నింపుతుంది. ఆరోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు.