విజయనగరం

జిల్లాలో 1 నుంచి జ్ఞానధార: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 20: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు జ్ఞానధార కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లాలో డి1, డి2 కేటగిరీలలో విద్యార్థులను గుర్తించి జ్ఞానధారలో శిక్షణనివ్వాలన్నారు. ఈ శిక్షణలో భాగంగా యోగా, కంప్యూటర్‌లో శిక్షణ, రోబోటిక్స్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆటలు తదితర విభాగాల్లో శిక్షణను అందించాలన్నారు. ఆరు గంటలు మాత్రమే భాషా, సైన్స్, గణితం శాస్త్రాలపై శిక్షణ ఉండాలన్నారు. శిక్షణలో పాల్గొనే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మనవూరు-మన బడి కార్యక్రమం కింద మధ్యలో బడి మానేసిన విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలన్నార. అందరు సమన్వయంతో పనిచేసి డ్రాప్ అవుట్ లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వౌలిక సదుపాయాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, మధ్యాహ్నా భోజన పథకం, ఏకరూప దుస్తులు సరఫరాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వసతి సౌకర్యాలు ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో జాబితా తీసుకొని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఐదో తరగతి నుంచి ఆరో తరగతి, తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లేటపుడు డ్రాపవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో చిట్టి గురువులు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కనీసం చదవడం, రాయడం నేర్చుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. డీఈవో నాగమణి, సాంఘీక సంక్షేమశాఖ డిడి సునీల్‌రాజ్‌కుమార్, డ్వామా పిడి రాజగోపాల్, గిరిజన సంక్షేమశాఖ డిడి నారాయణుడు, బీసీ సంక్షేమాధికారి కుష్భూ, మండల విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది ధర్మ పోరాట దీక్ష
బొబ్బిలి, ఏప్రిల్ 20: విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసగించిందని, ఇందుకు నిరసనగా ధర్మ పోరాట దీక్ష చేస్తున్నామని పురపాలక చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి, మాజీ చైర్మన్ ఆర్వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన) అన్నారు. స్థానిక దక్షిణ దేవుడివద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష చేశారు. ఈ మేరకు పురపాలక సంఘం మాజీ చైర్మన్ బేబీ నాయన, నియోజకవర్గం ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌లకు వీర తిలకాన్ని తూముల అచ్యుతవల్లి దిద్దారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే అన్నిరంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నాలుగేళ్ల పాటు పలుసార్లు కేంద్రం వద్ద వెళ్లి చర్చించినప్పటికీ ప్రయోజనం చేకూరలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా రాష్టానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు ప్రజలతోపాటు యువజన సంఘాలు, కార్మిక, కర్షక నాయకులు, యువకులు, మహిళలు సంపూర్ణ మద్దతును ప్రభుత్వానికి అందించాలన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని, గిరిజన యూనివర్శిటీతోపాటు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు, వైస్ ఛైర్మన్ రమేష్‌నాయుడుతోపాటు వార్డు కౌన్సిల్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.