విజయనగరం

హోదా సాధనే టీడీపీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. శుక్రవారం కోట జంక్షన్ వద్ద దివంగత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోట వద్ద ఏర్పాటు చేసిన సామూహిక ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం విభజన హామీలలో వేటిని పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వనందున పోరాటాన్ని ఉద్ధృతం చేశామన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ కేంద్రంతో పోరాటం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ఈ ధర్మపోరాట దీక్షలకు అన్ని జిల్లాల్లో సామూహిక ఉపవాస దీక్షలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పార్లమెంట్ సాక్షిగా విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. కేంద్రం మంజూరు చేసిన విద్యాలయాలు ప్రైవేటు భవంతుల్లో నిర్వహించాల్సి వస్తోందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, ఇతర వాటికి కేంద్రం నిధులు సక్రమంగా కేటాయించలేదన్నారు.
రైల్వేజోన్‌పై ఇప్పటికీ స్పష్టం చేయలేదన్నారు. గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చచిన్నంనాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొద్దుల నరసింగరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎన్‌ఎం రాజు, కె.శివరామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, తెలుగు యువత అధ్యక్షుడు కర్రోతు నరసింగరావు, కౌన్సిలర్లు కోండ్రు శ్రీను, మైలపల్లి పైడిరాజు, మీసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

‘పెళ్లి కానుక’ సింగిల్ డెస్క్ ప్రారంభం
విజయనగరం, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చపడుతున్న ‘చంద్రన్న పెళ్లి కానుక’తో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మహిళా ప్రాంగణంలో చంద్రన్న పెళ్లి కానుక సింగిల్ డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న పెళ్లికానుక వధూవరుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దివ్యాంగుల వివాహాలకు ఆయా సంస్థలు ప్రోత్సాహకాలు అందించేవని, నేడు వాటన్నింటిని ఒకే గొడుగు కిందకు తెచ్చి సింగిల్ డెస్క్ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు పాల్గొన్నారు.