విజయనగరం

బాల్యవివాహాన్ని అడ్డుకున్న శిశుసంక్షేమశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, ఏప్రిల్ 24: మండలంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని శిశుసంక్షేమశాఖాధికారి ఉమాభారతి, నేచర్ క్రియాశీల సంస్థ కో- ఆర్ఢినేటర్ ఎల్ వరలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని శంబర గ్రామానికి చెందిన తోటబండి సత్యనారాయణ కుమార్తె అయిన రమ్యను కొండరేజేరు గ్రామానికి చెందిన రెడ్డి ముత్యాలు కుమారుడు సింహాచలంనకు ఇచ్చి ఈనెల 27న వివాహాం చేసేందుకు నిశ్చయించారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన కార్డులను కూడా పంచిపెట్టారు. అయితే రమ్యకు 15 సంవత్సరాలని ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసుల ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఉమాభారతి, నేచర్ క్రీయాశీల సంస్థ కో- ఆర్ఢినేటర్ వరలక్ష్మిలు గ్రామానికి చేరుకుని గ్రామపెద్దల సమక్షంలో రమ్య తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయించిన ముహుర్తానికి నిశ్చతార్థం చేసుకుని రమ్యకు 18 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వివాహం చేసేందుకు అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేశామని, వివాహాన్ని నిలిపివేస్తే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతామని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
బలిజిపేట, ఏప్రిల్ 24: పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఇఓపీఆర్‌డీ దేవకుమార్ మాట్లాడుతూ 2017 అక్టోబర్ 14న పంచాయతీ గ్రామసభలను నిర్వహించామని, నేడు మండలస్థాయిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 73,74 సవరణల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. ఈమేరకు మండలంలోని పలగర, చాకరాపల్లి పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేసి సర్పంచ్‌లకు సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్తేర్‌రాణీ, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.