విజయనగరం

ఉత్తమ ఎంపీపీగా పెంట ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, ఏప్రిల్ 24: జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా పెంట ఉమ మంగళవారం జడ్పి ఛైర్‌పర్సన్ స్వాతీరాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాపరిషత్ కార్యాలయంలో మక్కువ ఎంపీపీ పెంట ఉమకు ఉత్తమ ఎంపీపీ అవార్డును అందించారు. ఈమేరకు ఉత్తమ ఎంపీపీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేయడంతో ఉత్తమ ఎంపీపీ అవార్డు అందించారని ఎంపీపీ తెలిపారు. చంద్రబాబునాయుడు ఆశీస్సుల మేరకు శక్తివంఛన లేకుండా పనిచేస్తున్నానన్నారు. అలాగే తన భర్త మండల టీడీపీ అధ్యక్షులు పెంట తిరుపతిరావు సహకారంతో గత నాలుగేళ్లుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఎంపీపీ అహర్నిశలు కష్టపడి పంచాయతీకి వౌళిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, తదితర వాటిని మంజూరుచేసి అందరి మన్ననలు పొందారన్నారు. గతంలో కంటే ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించారన్నారు. మండలాన్ని ఉత్తమ మండలంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
డ్రిప్ విధానం ద్వారా పంటలను సాగుచేస్తే సాగునీరు ఆదా
మక్కువ, ఏప్రిల్ 24: డ్రిప్ విధానం ద్వారా పంటలను సాగుచేస్తే సాగునీరు ఆదా అవుతుందని హార్టీ కల్చర్ ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని డి శిర్లాం గ్రామంలో వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు, సర్పంచ్ వెలమల వనజాక్షిల ఆధ్వర్యంలో రైతు కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభదాయకమైన మొక్కజొన్న, అరటి, చెరకు, పామాయిల్ పంటలను డ్రిప్ విధానంలో సాగుచేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సీడీ, మిగిలిన రైతులకు 90 రాయితీపై డ్రిప్ పరికరాలను అందిస్తామన్నారు. సన్నకారు రైతులకు మినీ ట్రాక్టర్లపై లక్ష రూపాయలు, పవర్ టిల్లర్లపై 50శాతం సబ్సీడి అందిస్తామన్నారు. పామాయిల్ మొక్కలతోపాటు పోషణకు మూడు సంవత్సరాల పాటు ఎకరాకు 200 రూపాయలు అందిస్తామన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ చెరకు పంటను డ్రిప్‌పై సాగుచేస్తే అధిక దిగుబడులు రావడంతోపాటు తక్కువ నీటితో ఎక్కువగా సాగుచేయవచ్చునన్నారు. రైతులు ప్రతీ ఏడాది విత్తన మార్పిడి చేసుకోవాలన్నారు. వృధాగా ఉన్న నాడెప్ కంపోస్టు ఫిట్‌లలో ఎరువుల తయారుచేసుకోవచ్చునన్నారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలను వేసుకుంటే చీడపీడలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇఓలు పైడితల్లి, నవీన, భారతి,ఎంపీఇఓలు పాల్గొన్నారు.