విజయనగరం

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 50శాతం రాయితీపై ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(్ఫర్టు), ఏప్రిల్ 24: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలో 50శాతం రాయితీపై ప్రభుత్వం ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం దివ్యాంగుల బస్ పాస్‌ల మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ దివ్యాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటపుడు ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా 50శాతం ప్రయాణ రాయితీని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఈ సదుపాయాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. అన్ని వర్గాల ప్రజానీకానికి ప్రభుత్వం ఎన్నో రాయితీలను కల్పిస్తుందని ఆమె చెప్పారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎ. అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలోని 15వేల దివ్యాంగుల పాస్‌లను పంపిణీ చేశామని తెలిపారు. వందశాతం అంధత్వం, మూగత్వం, వినికిడి లోపం ఉన్నవారికి, 69శాతం కన్నా తక్కువ బుద్ధిమాంద్యం ఉన్నవారికి, 40శాతానికి మించి ఆర్థోపెడిక్ లోపం ఉన్న వారికి బస్‌పాస్‌లను జారీ చేస్తామని అన్నారు. బస్‌పాస్‌లు పొందిన దివ్యాంగులు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో 50శాతం ఛార్జీతో ఒక సంవత్సరం ప్రయాణం చేయవచ్చునని అన్నారు. డిపో మేనేజర్ ఎన్.వి. ఎస్.వేణుగోపాల్ మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో విజయనగరం డిపో ద్వారా 4592 నవ్యా క్యాట్‌కార్డులు, 10459 వనితా ఫ్యామిలీ కార్డులు, 50 విహారీ కార్డులు, 8045 నెలవారీ సీజన్ టిక్కెట్లతోపాటు 1821 మంది దివ్యాంగులకు వివిధ రాయితీ పాస్‌లను జారీ చేశామని అన్నారు. దివ్యాంగులకు రాయితీ పాస్‌లు అందించేందుకు నియోజకవర్గం పరిధిలో మండలాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్ స్టేషన్ మేనేజర్ రాంబాబు, ట్రాఫిక్ సూపర్‌వైజర్ దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.

చుక్కవలసలో మన ఊరు- మన బడి కార్యక్రమం
తెర్లాం, ఏప్రిల్ 24: మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మండలం చుక్కవలస గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలకంఠం ఇంటింటికి వెళ్లి మంగళవారం సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యాబోధనలు చేస్తున్నామన్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్కూల్ కమిటీ ఛైర్మన్ ఏ తిరుపతి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు జి శాంతకుమార్, శంకరరావు, ఉమ, మదు, శివున్నాయుడుతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.