విజయనగరం

గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 24: గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులను సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని భావించి రాజ్యాంగ నిపుణులు పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. తద్వారా గ్రామ పంచాయతీలే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే మంచి అవకాశం ఏర్పడిందని అన్నారు. ఎంపీడీవో బి. ఈశ్వరరావు మాట్లాడుతూ సుధీర్ఘ చర్యలు, సమాలోచనలు, ఎన్నో సంవత్సరాలు దేశవ్యాప్తంగా చేపట్టిన తరువాతే 1993లో 73వ రాజ్యాంగ సవరణకు ఆమోద ముద్ర వేశారని అన్నారు. తద్వారా 73వ రాజ్యాంగ సవరణ వలనే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయని అన్నారు. గ్రామాలలో ఎన్నికలు, సుపరిపాలన, అభివృద్ధి ప్రణాళికలు వంటి ఎన్నో సదావకాశాలు కల్పించిందని అన్నారు. అనంతరం ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, వైస్ ఎంపీపీ కనకల పోలినాయుడు, ఎంపీటీసీ వైకుంఠం మైథిలీ ప్రియాంక, సర్పంచ్‌లు రెడ్డిఅన్నపూర్ణలను ఘనంగా సత్కరించారు. అలాగే ఉత్తమ కార్యదర్శులు, కార్యాలయ సీనియర్ సహాయకులు సోమేశ్వరరావును సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

యాజమాన్య పద్దతులతో అధిక ఆదాయం
గజపతినగరం, ఏప్రిల్ 24: పంటల సాగులో యాజమాన్య పద్దతులు పాటించడం ద్వారా అధిక ఆదాయం లభిస్తుందని రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఎన్.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని కొణిశ గ్రామంలో రైతు కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్దతులు అవలంభిస్తే అధిక దిగుబడులతోపాటు అధిక ఆదాయం లభిస్తుందని అన్నారు. రైతులు విత్తనోత్పత్తి పథకం ద్వారా రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకోవాలని సూచించారు. గజపతినగరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఆర్. అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న యాంత్రీకరణను వినియోగించుకోవాలని అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు రాయితీపై సరఫరాకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తహశీల్దార్ బి.శేషగిరిరావు మాట్లాడుతూ అర్హులైన కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం ధరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని అన్నారు. మండల వ్యవసాయ అధికారి టి. సంగీత విత్తనాలు, యంత్ర పరికారాలు కావాల్సిన రైతుల వద్ద నుంచి ధరఖాస్తులు స్వీకరించారు. భవిష్యత్‌లో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో గ్రామసభలు జరుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా సత్యసాయి ఆరాధన మహోత్సవం
గజపతినగరం, ఏప్రిల్ 24: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలోని సత్యసాయి సేవా మందిరంలో భగవాన్ సత్యసాయిబాబా ఆరోధన మహోత్సవం కన్వీనర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. ఉదయం 5.30గంటలకు ప్రభాత ప్రార్థన, నగర సంకీర్తన జరపగా మహిళా యువజన సేవాదళ్ సభ్యులతో ప్రసాదం తయారు చేయించారు. మధ్యాహ్నం 12గంటలకు మెయిన్‌రోడ్డులో గల బాబా మెడికల్ గుప్త షాపు వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం జరిపారు. సాయంత్రం 6.30కు ప్రత్యేక నామసంకీర్తన జరిపిన అనంతరం మంగళ హారతి ఇచ్చారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంఘం సభ్యులు కె. ఎ. ఎస్. ఎస్.గుప్త, పొట్టానాధం, టి.విశ్వనాథ్, వైకుంఠం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని మరుపల్లి గ్రామంలో గల సత్యసాయి ఆలయంలో భజన మండలి అధ్యక్షులు బి. ఎస్. పాత్రో ఆధ్వర్యంలో సత్యసాయి ఆరాధన మహోత్సవం జరిగింది. ఉదయం నగర సంకీర్తన జరపగా సాయంత్రం జరిగిన ప్రత్యేక భజన కార్యక్రమంలో గజపతినగరం ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
వేపాడ, ఏప్రిల్ 24: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దాసరి లక్ష్మి అధ్యక్షతన ఎంపీడీవొ ఎ.వి. ఆర్. పట్నాయక్ సారధ్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామాల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మండలంలోని జగ్గయ్యపేట, వావిలపాడు మహిళా సర్పంచ్‌లు సూరమ్మ, రాజేశ్వరలతోపాటు ఆయాగ్రామాల పంచాయతీల కార్యదర్శులు గేదెల సత్యనారాయణ, నానిబాబులకు దుశ్శావులతో జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. సంపూర్ణ ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దునందుకు వావిలపాడులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ద్వారా ఎరువులను ఉత్పత్తిచేసేందుకుగాను వీరిని ప్రోహించారు.
పచ్చిరొట్ట ఎరువులతో భూసారాన్ని పెంచుకోవాలి
బొండపల్లి, ఏప్రిల్ 24: పచ్చిరొట్ట ఎరువులతో భూసారాన్ని పెంచుకోవాలని స్థానిక మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర సూచించారు. మంగళవారం మండలంలోని మరువాడ, ఎం.కొత్తవలస గ్రామాలలో రైతుకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులు వాడకం వలన భూసారం పెంపొందించడంతోపాటు సాగు ఖర్చు తగ్గుతుందని అన్నారు. అలాగే సూక్ష్మధాతు ఎరువులు వినియోగంతో చీడపీడలు నివారించవచ్చు అని చెప్పారు. వ్యవసాయ రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలపై అవగాహన కల్పించేందుకు రైతు కోసం అనేక కార్యక్రమాలు గ్రామాలలో చేపడుతున్నామని చెప్పారు. ఉత్పత్తి, ఉత్పాదకత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పశువైద్యాధికారి బి.వి.రమణ మాట్లాడుతూ పాడిపశువుల అభివృద్ధిని పరిశీలించేందుకు ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాలు మంజూరు చేస్తున్నదని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వేసవిలో పశువుల సంరక్షణపై వివరించారు. కూరగాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు 50శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నామని ఉద్యాన వనశాఖ ఎంపీ ఇవొ నారాయణరావుతెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ, మై క్రో ఇరిగేషన్, వెలుగు ఎంపీఇవొలు వౌనిక, వెంకటరమణ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

జల్లులతో చల్లబడిన వాతావరణం
గజపతినగరం, ఏప్రిల్ 24: మండు వేసవి ఒకవైపు, ఉక్కపోత మరోవైపురెండింటి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు మంగళవారం మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి జల్లులు పడడంతో ప్రజలు సేద తీరారు. సుమారు గంటసేపు ఏకధాటిగా జల్లులతోపాటు చల్లని గాలులు వీయడంతో వాతావరణాన్ని ప్రజలు ఆస్వాధించి వేసవితాపం నుండి ఉపశమనం పొందారు. జల్లులు పడడంతో మండలంలో చాలా గ్రామాలలో మొక్కజొన్న పంట పొలాల్లో నుండి ఎన్నులు ఏరి కళ్ళాల్లో ఎండబెట్టగా అవి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. దీని వలన పంట మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలి
నెల్లిమర్ల, ఏప్రిల్ 24: గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంపీడీవొ కె.అక్కారావు అన్నారు. మంగళవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవొ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఉందని అన్నారు. గ్రామ పంచాయతీలు దేశానికి పట్టుకొమ్మలని కొనియాడారు. గ్రామ పంచాయతీలలో పరిశుభ్రతతోపాటు స్వచ్ఛమైన గాలి, నీరు లభించేల చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలలో సౌకర్యాలు కల్పించి ప్రగతి పథంలో నడుస్తున్నాయని అన్నారు. అనంతరం ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికైన దన్నానపేట సర్పంచ్ గేదెల రాజారావు, కొత్తపేట సర్పంచ్ గురాన లక్ష్మిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇవొపీఆర్డీ హెచ్. భానోజీరావు, నాయకులు సువ్వాడ రవిశేఖర్, గురాన అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద ఆయిల్ పరిశ్రమపై విజిలెన్స్ దాడులు
* 6(ఎ) కేసు నమోదు
బొండపల్లి, ఏప్రిల్ 24: మండలంలోని నెలివాడ గ్రామం పరిధిలో గల వివేకానంద ఆయిల్ పరిశ్రమపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వివేకానంద ఆయిల్ పరిశ్రమలోని తారు డబ్బాలను స్వాధీనం చేసుకుని వారిపై 6(ఎ) కేసు నమోదు చేశారు. రూ. 9.30 లక్షలు విలువైన తారుడబ్బాలు, రూ.85వేలు విలువ చేసిన బ్లాక్ ఆయిల్ డ్రమ్ములు, రూ. 5,850 విలువ చేసిన డీజిల్ ఆయిల్ 90 లీటర్లు స్వాధీనం చేసుకున్నారని సిఎస్‌డిటి సత్యనారాయణమూర్తి విలేఖరులకు తెలిపారు.

గ్రామాలే పట్టుకొమ్మలు
- జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి

విజయనగరం, ఏప్రిల్ 24: గ్రామాలే పట్టుకొమ్మలని వాటిని అభివృద్ధి చేసుకోవాలన్న తపన సర్పంచ్‌లకు ఉండాలని జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మూడేళ్లుగా పంచాయతీరాజ్ దినోత్సవాలకు వేర్వేరు ప్రాంతాలలో పాల్గొన్నానన్నారు. ఈ ఏడాది మన జిల్లాలో శాఖాపరంగా ఉత్తమ సేవలందించిన 93 మందికి అవార్డులు అందించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్ధానంలో నిలిచామన్నారు. స్థానిక సంస్థలలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాల గురించి వివరించారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర భవన నిర్మాణం, పంచాయతీ భవనాలను నిర్మించుకోగలిగామన్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణ అమలు చేస్తున్నామన్నారు. జెడ్పీ నిధులతో గరివిడి వెటర్నరీ యూనివర్శిటీ, విటి అగ్రహారంలో పందుల పునరుత్పత్తి కేంద్రం అభివృద్ధి చేశామన్నారు. జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రాపురం, బొబ్బిలిలోని కలవరాయిలో మత్స్యకారులకు సామాజిక భవనాలు నిర్మించామన్నారు. రూ.3.23 కోట్లతో 150 సిమెంట్ రహదారులు, కాలువలు, మరో రూ.25 లక్షలతో 15 గ్రావెల్ రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. రూ.70 లక్షలతో 31 వసతి గృహాలకు ప్రహారీ గోడలు నిర్మించామన్నారు. రూ.158.52 లక్షలతో 52 పంచాయతీ కార్యాలయాలను నిర్మించామన్నారు. ఇదిలా ఉండగా రూ.127.87 లక్షలతో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 98 అభివృద్ధిపనులు, రూ.66.72 లక్షలతో ఎస్టీ ఉప ప్రణాళిక కింద 54 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బోగాపురం, మెంటాడలో అగ్ని బాధితులకు గృహోపకరణాలు అందజేశామన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరచడంతోపాటు పారిశుద్ధ్య విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు.
పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ఆమె అవార్డులు అందజేశారు. వారిలో 11 మంది జెడ్పీటీసీలు, 10 మంది ఎంపీపీలు, 10 మంది ఎంపీటీసీలు, నలుగురు సర్పంచ్‌లు, ఐదుగురు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఏడుగురు కార్యాలయ సిబ్బంది, డిఆర్‌డిఏ, డ్వామాల నుంచి 17 మంది సిబ్బందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సిఇఒ రాజ్‌కుమార్, డ్వామా ఎపిడి రామచంద్రరావు, అకౌంట్స్ అధికారి శారద, డిపివో సత్యనారాయణ, జెడ్పీటీసీలు రమణ, సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.