విజయనగరం

నూతన భవన సముదాయానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, ఏప్రిల్ 26: పార్వతీపురంలోని ప్రకాశం టౌన్ హాలు ఎదురుగా రూ.5కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఐటిడి ఎ భవన నిర్మాణ సముదానికి రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి నూతన భవన సముదాయం నిర్మాణ నమూనాలను కలెక్టర్ వివేక్ యాదవ్ వివరించారు. ఈకార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు, మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

స్టాల్స్ పరిశీలన చేసిన మంత్రి
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పార్వతీపురం, ఏప్రిల్ 26: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఐటిడి ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి లోకేష్ గురువారం తిలకించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఐసిడి ఎస్, జిసిసి తదితర సంస్థల ద్వారా ఏర్పాటు చేసే స్టాల్స్‌ను పరిశీలించారు. అలాగే ఐసిడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు నిర్వహించే సీమంతాల కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఈకార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్ వివేక్‌యాదవ్, పీవో తదితరులు పాల్గొన్నారు.

తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల
పార్వతీపురం, ఏప్రిల్ 26: నాగూరు నియోజకర్గం మాజీ ఎమ్మెల్యే, వైకాపా పార్టీ నాయకుడు శత్రుచర్ల చంద్రశేఖరరాజు తన అనుచరులతో తెలుగుదేశం పార్టీ నేత,రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ క్యాంపుహౌస్‌లోని గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు, మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, కేంద్రమాజీ మంత్రి అశోకగజపతిరాజు, ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌థాట్రాజ్‌లు ఉన్నారు.

మినీ ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
సీతానగరం, ఏప్రిల్ 26: మండలంలోని జోగింపేట ప్రతిభా గిరిజన గురుకుల పాఠశాలలో మినీ ఆడిటోరియం నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖామంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేశారు. ముందుగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ చేశారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన శిలాపలకాన్ని ఆయన ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధితోపాటు పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఐటీడీఏ పీఓ లక్ష్మీషా, ఆర్డీఓ సుదర్శనదొర, స్థానిక టీడీపీ నాయకులు కొమ్మినేని కిశోర్‌కుమార్, తెంటు వెంకటప్పలనాయుడు, ఎస్ హరిగోపాలరావు, ఆర్ వేణు, కొల్లి తిరుపతిరావు, తదితరులతోపాటు వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.