విజయనగరం

విశాఖను ఐటి హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, ఏప్రిల్ 26: విశాఖటప్నం ఐటి హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటిల శాఖాల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గురువారం పార్వతీపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న గిరిజన శిక్షణార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు గురించి పలు ప్రశ్నలు వేసి వారి నుండి సమాధానాలు రాబట్టారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటిడి ఎల ద్వారా గిరిజనాభివృద్ధికి కృషి చేయగానికి 1986లో ఐటిడి ఎ కానె్సప్ట్‌లను ప్రవేశపెట్టిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామరావుకే దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఆరు ఐటిడి ఎలలో యువ ఐ ఎ ఎస్ అధికార్లను నియమించిన ఘనత ఇప్పటి సి ఎం చంద్రబాబునాయుడుదేనన్నారు.యువతకు వారి స్వంత జిల్లాల్లోనే ఉపాధి కల్పించాలని సి ఎం చేస్తున్న ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వైటిసి శిక్షణార్థుల్లో జియ్యమ్మవలస మండలంలోని ఇటిక గ్రామానికి చెందిన శంకర్ ఐటి అభివృద్ధికి తీసుకున్న చర్యలు గురించి ప్రశ్నించగా మంత్రి లోకేష్ స్పందిస్తూ 1996లో హైదరాబాదు కేంద్రంలో సైబర్ టవర్స్ ఏర్పాటు చేసి 6.50లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. విభజన తరువాత విశాఖను మన రాష్ట్రంలో విశాఖను ఐటి హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీకాకుళం,విశాఖ, విజయనగరం జిల్లాల్లో కూడా ఐటి రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించడానికి కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని తెలిపారు. శ్రావణి మాట్లాడుతూ శిక్షణ పొందిన పిదప సుదూర ప్రాంతాలల్లో ఉపాధి లభిస్తుండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని దగ్గరలోనే ఉపాధి కల్పించాలని కోరగా ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు వస్తున్నందున సొంత జిల్లాల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సంధ్య అనే శిక్షకురాలు జూనియర్ కళాశాలల వరకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్న ప్రభుత్వం పార్వతీపురంలో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరగా సి ఎం దృష్టికి తీసుకువెళ్లి తగిన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. శిరీష మాట్లాడుతూ శిక్షణ పొందిన వెంటనే ఉద్యోగంలో చేరడానికి వెళితే అక్కడ తక్షణమే అద్దె, ఇతర ఖర్చులు అధికంగా కావడం వల్ల ఇంటి వద్దనుండి డబ్బులు తీసుకువెళ్లడానికి స్తోమత లేక అవస్థలు పడుతున్నామని మంత్రి దృష్టికి తేగా వెంటనే ఆయన స్పందిస్తూ ఉద్యోగంలో లభించే జీతం నుండి వెంటనే రూ.10వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లోని రోడ్లు నిర్మించడంలో యువత నుండి ప్రభుత్వం ఏమి ఆశిస్తుందని ఇటిక గ్రామానికి చెందిన నూకరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ దేశ భవిత యువతీ యువకుకుల మీదనే ఆధారపడి ఉందన్నారు. అందువల్ల గిరిజన ప్రాంతాల్లోని రోడ్లు ఇతర నిర్మాణ పనులు చేపట్టడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్‌లో శిక్షణ పొంది కాంట్రాక్టర్లుగా ఎదిగి గ్రామాలను బాగుచేసుకోవాలని కోరారు. కంబవలసకు చెందిన శ్రీవాణి మాట్లాడుతూ వైటిసిల ద్వారా శిక్షణ పొందిన వారిలో 390మంది సుదూర ప్రాంతాల్లో ఉపాధి పొందామని, తామందరికీ దగ్గరలో ఉపాధి కల్పించాలని కోరగా జిల్లాలోని భోగాపురంలో ఉపాధి అవకాశాలున్నాయని అక్కడ చేరడానికి ఆసక్తి ఉంటే ఉపాధి కల్పిస్తామన్నారు. జంఝావతి రబ్బరు డ్యామ్ ఎగువన ఉన్న తమకు ముంపుభయం కలుగుతుందని తెలియజేయగా కలెక్టర్‌తో చర్చించి సమస్య పరిష్కరిస్తానన్నారు. ఈకార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అధ్యక్షత వహించగా రాష్ట్ర భూగర్భగనులశాఖామంత్రి సుజయకృష్ణ రంగారావు,పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఐటిడి ఎ పీవో లక్ష్మీశ, శాసన మండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్సీ కొత్తపల్లి సుబ్బారాయుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.