విజయనగరం

ప్రత్యేక హోదాకు ప్రజల మద్దతు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఏప్రిల్ 26: ప్రత్యేక హోదా సాధనకు ప్రజల మద్దతు అవసరం ఉందని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. మండలంలోని రెండవ రోజు మండల టీడీపీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రులంటే ప్రధాని మోడీకి చిన్నచూపు అని అందుకే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని అన్నారు. మొండి వైఖరి ప్రధాని విడనాడాలంటే ఆంధ్రులందరు ముక్తకంఠంతో ప్రత్యేక హోదా పోరులో పాల్గొనాలని నాయుడు పిలుపునిచ్చారు. నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినా కేంద్రంలోని పెద్దలు కనికరించలేదని గుర్తు చేశారు. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల దెబ్బకు రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిందని, హోదా ఇస్తామని మోసం చేసి బీజేపీ నామరూపాలు లేకుండా పోతుందని ఎమ్మెల్యే నాయుడు విమర్శించారు. రెండవ రోజు సైకిల్ యాత్ర ఎమ్మెల్యే నాయుడు ఒంపల్లి, వేండ్రాం, గరుడుబిల్లి, కొండకిండాం, కిండాం అగ్రహారం, రాచకిండాం, చామలవలస గ్రామాలలో చేపట్టారు. ఈ సైకిల్ యాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంటిరాజు, జడ్పీటీసీ బండారు బాలాజీ, మండల టీడీపీ అధ్యక్షుడు కోరాడ కృష్ణ, మాజీ ఎంపీపీ బండారు కృష్ణమూర్తి, కొండకిండాం సర్పంచ్ ముంజేటి పార్వతి, లెంక రామారావు, తాడ్డి బాలవెంకటలక్ష్మి, నక్కిన బంగారయ్య, గండ్రేటి రమణమ్మ, ఎంపీటీసీలు బూర్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బొత్స జన్మదిన వేడుకలు
గజపతినగరం, ఏప్రిల్ 26: మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత బొత్స అప్పలనర్సయ్య 56వ జన్మదిన వేడుకలు గురువారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకర్గంలోని గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలతోపాటు సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండల వైకాపా నాయకులు, కార్యకర్తల నడుమ బొత్స అప్పలనర్సయ్య జన్మదిన వేడుకలు జరిగాయి. తన క్యాంపు కార్యాలయంలో దత్తిరాజేరు మండల నాయకులు ఏర్పాటు చేసిన 56కిలోల కేక్‌ను అప్పలనర్సయ్య కట్ చేశారు. అనంతరం గజపతినగరం మండల నాయకులు అప్పలనర్సయ్యకు గజమాలతో సత్కరించడంతోపాటు రాధకృష్ణల పాలరాతి విగ్రహాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గజపతినగరం మండల నాయకులు ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు,రొట్టెలు పంపిణీ చేశారు. అనాధాశ్రమంలోని విద్యార్థులకు పళ్లు, రొట్టెలు అందజేశారు. అంతకుముందు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది వలే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు గార తవుడు, మంత్రి అప్పలనాయుడు, వర్రి నర్సింహమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, ఈదుబిల్లి కృష్ణ, కడుబండి రమేష్‌లు, వైకాపా నాయకులు కనకల సుబ్రహ్మణ్యం, కరణం ఆదినారాయణ, మండల సురేష్, ఉత్తరావిల్లి అప్పలనాయుడు, పల్లి సంజీవరావు, బెల్లాన త్రినాథరావు, పీరుబండి జైహింద్ కుమార్, దొగ్గ దేవుడునాయుడు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రత్యేక నేత్ర పరీక్షలు
గజపతినగరం, ఏప్రిల్ 26: గజపతినగరం, మెంటాడ మండలాల్లోని భవిత కేంద్రాలలో గల ప్రత్యేక అవసరాల విద్యార్థులకు గురువారం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గల కంటి వైద్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ- ఐకేర్ కేంద్రంలో నిర్వాహకులు పాణిగ్రహి బాలాజీ, సముద్రాల సాంబశివరావులు 37మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేపట్టారు. కంటి లోపాలను గుర్తించి అవసరమైన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళాద్దాలు ఉచితంగా అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజంతా ప్రత్యేక అవసరాల విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఐఆర్‌పిలు శ్రీనివాసరావు, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.