విజయనగరం

సైబర్ క్రైమ్‌ను నిరోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 26: సమాజంలో ఆర్థిక నేరగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని దానిని అరకట్టేందుకు అత్యాధునికమైన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సైటెక్ ల్యాబ్స్ సిఈవో సందీప్ ముదల్కర్ అన్నారు. గురువారం ఇక్కడ పోలీసు శిక్షణ కళాశాలలో సెంట్రల్ టాక్స్ ఇన్‌స్పెక్టర్లకు, సివిల్ పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధమైన నేరాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఎటిఎం కార్డు, బ్యాంకు ఖాతా నంబర్లు హ్యాకింగ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతా నంబరు వివరాలు గురించి ఎవరు ఫోన్లో అడిగినా ఆ వివరాలు చెప్పరాదని సూచించారు. ఎటిఎం కార్డులు ట్యూనింగ్ కాకుండా చూడాలన్నారు. కస్టమర్ వెరిఫికేషన్ నంబర్లను స్కిమ్మింగ్ చేసి ఖాతాదారుల నంబర్లను తెలుసుకొని వాటి ద్వారా కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అందువల్లనే ఎవరైనా బ్యాంకు వివరాలు అడిగితే ఆ ఫోన్ నంబరు వివరాలను పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సోషల్ మీడియాలో ఫొటొలు మార్పింగ్ చేసి కొంతమంది బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి నేరాలు జరిగినపుడు పోలీసుల ఏ విధంగా స్పందించాలి అనే అంశంపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సోషల్ మీడియాలో అన్‌నాన్ నంబర్సు పేరు తెలిస్తే ప్రొఫైల్ తెలిసిపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మన పర్సనల్ వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో స్వైపింగ్ మెషిన్లకు స్కిమ్మర్లను అమర్చుతున్నారని దానివల్ల ఆ స్వైపింగ్ మెషిన్‌లో ఎటిఎం కార్డు పెట్టినపుడు ఆ కార్డులో ఉన్న డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రతి చోట అప్రమత్తంగా ఉండటంతోపాటు వన్‌టైం పాస్‌వర్డు ఉపయోగించడం వల్ల తరచు ఇటువంటి వాటి బారినపడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ రాజశిఖామణి, డిఎస్పీలు ఎం.నరసింహరావు, బిఎ పవన్‌కుమార్, పలువురు ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.