విజయనగరం

పేద విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, మే 22: పేద విద్యార్థులకు హెల్పింగ్ హేండ్ సొసైటీ ద్వారా ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హెల్పింగ్ హేండ్ సొసైటీ ఉత్తరాంధ్రా జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి వరప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు ఉచితంగా కార్పోరేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 25వ తేదీన స్థానిక చొక్కాపు రామినాయుడు డైట్ కళాశాల వద్ద తమ యొక్క 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్, ఈ సెట్ ర్యాంకు ఒరిజినల్ కార్డులతో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కళాశాలలో చేరగోరే విద్యార్థులకు ఉచితంగా ఫీజులు, వసతి, పుస్తకాలను సొసైటీ అందిస్తుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 8499093721ను సంప్రదించాలన్నారు.
ఇళ్ల పన్నుల వసూళ్లును ముమ్మరం చేయాలి
రామభద్రపురం, మే 22: గ్రామ పంచాయతీలలో ఇళ్ల పన్నుల వసూళ్లును ముమ్మరం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ ఆదేశించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం ఆయన పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో ఇళ్ల పన్నుల వసూళ్లును పూర్తిచేయాలన్నారు. రామభద్రపురం మండలంలో 31లక్షలు ఇళ్లపన్నుల బకాయిలు ఉన్నాయని, వెంటనే వసూళ్లు చేయాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రియాసాఫ్ట్ ద్వారా గ్రామపంచాయతీ రికార్డులను ప్రతీ ఏటా ఆన్‌లైన్ చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తి వివరాలను ఇందులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే చెత్త నుంచి సంపద షెడ్లు అన్ని పంచాయతీలలో నిర్మించి గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇఓపీఆర్‌డీ సుగుణాకరరావు, కార్యదర్శులు పాల్గొన్నారు.