విజయనగరం

మున్సిపాలిటీపై కలెక్టర్‌పై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 22: విజయనగరం మున్సిపాలిటీపై జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక నుంచి ప్రతీరోజూ వార్డుల్లో పర్యటించాలని, ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకూ వార్డు సందర్శన చేపట్టాలని, అభివృద్ధిపై వారానికి ఒకసారి ప్రతీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అధికారులతో సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్, మున్సిపల్ ప్రజారోగ్య అధికారులకు దశ,దిశ నిర్ధేశం చేశారు. పౌరసేవలు నిర్ణీత గడువులోగా అందేవలసిందేనని, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయవలసిందేనని ఆదేశించారు. పట్టణ అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పట్టణంలో అన్నిరకాల పన్నుల వసూళ్లపై ప్రత్యేంగా దృష్టి సారించాలని, పేరుకుపోయిన బకాయిల వసూళ్ల కోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆస్తిపన్ను, నీటిపన్ను, ఖాళీస్థలాలపై పన్నులను సకాలంలో వసూలు చేయాలని, ఈ విషయంలో అశ్రద్ద వహించిన మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని ఆక్రమణలు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు తదితర ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా హోర్డింగ్‌లు, ప్రకటనల బోలు ఏర్పాటు చేసేందుకు నిర్ణీత స్థలాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో మాత్రమే ప్రచార సామాగ్రి ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ చట్టం ప్రకారం పన్నులు విధించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పట్టణ పరిధిలో ఉన్న 35 పార్కుల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించిన కలెక్టర్ ఆయా పార్కుల పర్యవేక్షణ, నిర్వహణ, అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత నోడల్ అధికారి బాధ్యత వహించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పెద్దపెద్ద మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించాలని ఆయన ఆదేశించారు. రానున్న రెండునెలల్లో అన్ని కాలువల్లో పూర్తిస్థాయిలో పూడికలను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్‌డి అనిత, ఆర్డీఒ జెవి మురళి, అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మెప్మా పిడి లక్ష్మునాయుడు, మున్సిపల్ ఇంజనీర్ రాజేంద్రకృష్ణ, రోడ్డు సెఫ్టీ డిఎస్‌పి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

‘పోకిరి’ రకంతో వేరుశనగలో అధిక దిగుబడులు
చీపురుపల్లి, మే 22: వేరుశనగ పంటలో వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయని ప్రస్తుతం ఉన్న ‘పోకిరి’ రకం విత్తనాలతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎన్ వి వేణుగోపాల్ తెలిపారు. ఈమేరకు మండంలోని కర్లాం గ్రామంలో ఒకరైతుకు చెందిన వేరుశనగ పంటకు సంబంధించి గతంలో చేసిన ప్రయోగాన్ని జాతీయ పంటల పరిశోధనా సంస్థకు చెందిన వ్యవసాయశాస్తవ్రేత్తల బృందం మంగళవారం పరిశీలించింది. వేణుగోపాల్ విలేఖరులతో మాట్లాడుతూ గతంలో చీపురుపల్లి వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సుమారు రెండువేల హెక్టారుల్లో వేరుశనగ పంట ఉండేదని క్రమేణా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఇతర పంటలపై దృష్టిసారించి వేరుశనగ పంటను వదిలివేయడంతో పంట సాగువిస్తీర్ణం తగ్గిందని పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యవసాయశాఖ దృష్టి సారించడం జరిగిందని ఇందుకోసం అధునాతన విత్తనాలను అభివృద్ధి చేసి మరలా చీపురుపల్లి పరిధిలో వేరుశనగ విస్తీర్ణం పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వివరించారు. కదిరి నుంచి తీసుకువచ్చిన నాలుగు రకాల వేరుశనగ విత్తనాలను, తిరుపతి నుంచి తీకువచ్చిన విత్తనాలను ‘పోకిరి’తో సరిపోల్చగా పోకిరి రకం విత్తనాల వినియోగించిన పొలంలో అధిక దిగుబడి వచ్చినట్టు శాస్తవ్రేత్తలు గుర్తించారు. పోకిరి రకం విత్తనంలో సుమారు 70 నుంచి 90రోజుల్లో పంట చేతికి వస్తుందని, తదుపరి పంటకు నేల అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వేసవిలో వేసిన పంట సుమారు 60నుంచి 70రోజుల్లో పోకిరి రకం దిగుబది ఇస్తుందని, వేరుశనగకు నీటి తడిని, జిప్పంను ఎకరానికి వంద కేజీలు పూత దశలో ఊడల దశ సమయంలో పదిరోజులు వేయాలి. ఎస్ ఎస్‌పి, జిప్సంలను మాత్రమే వినియోగించాలని, యూరియాని వాడవద్దని తెలిపారు. ఈవిధమైన ప్రమాణాలు పాటించడం ద్వారా వేరుశనగలో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రయోగాత్మకంగా రుజువుకాబడిందని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ శాస్తవ్రేత్తలు రాజేష్, బి నవీన్‌కుమార్, ఆత్మా అధికారి బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ పథకం ద్వారా మండలంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలపట్ల శాస్తవ్రేత్తల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.