విజయనగరం

నల్లబ్యాడ్జీలతో సర్వేయర్ల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మే 22: ఏళ్ళు గడుస్తున్నా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎటువంటి పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి సర్వేయర్లు గత 15వ తేదీ నుండి నిరసన తెలుపుతున్నారు. స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ సి.హెచ్. గణపతిరావు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ వద్ద సర్వేయర్లు నిరసన చేపడతామని తెలిపారు. అలాగే ఈ నెల 31న అమరావతిలోని సిసిఎల్‌ఎ వద్ద సర్వేయర్లు ఉద్యోగోన్నతి కోసం ధర్నా కార్యక్రమంచేపడతామని అన్నారు.
దివ్యాంగులకు సేవలు చేయడం అదృష్టం
కొత్తవలస, మే 22: దివ్యాంగులకు సేవ చేయడం ఒక అదృష్టంగా భావించాలని హైదరాబాద్‌కు చెందిన రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన బృందంతో కలసి మంగలపాలెంలోని శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టును సందర్శించారు. ఈ సందర్భంగా పది మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేయడం దైవంతో సమానమని ట్రస్టు ద్వారా రాపర్తి జగదీష్‌బాబు ఎంతో మంది దివ్యాంగులను ఆదుకుంటున్నారని తెలిపారు. ఉచితంగా కృత్రిమ అవయవాలు అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. తాను కూడా కొంత సేవ చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖ జిల్లాల నుండి వస్తున్న దివ్యాంగులకు రానుపోను ఖర్చులు పెట్టేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొండగుంపాంలో ఘనంగా ఇంటమ్మతల్లి పండగ
నెల్లిమర్ల, మే 22: మండలంలోని కొండగుంపాం గ్రామంలో మంగళవారం ఇంటమ్మతల్లి పండగను ఘనంగా నిర్వహించారు. నడిపేన, మొయిద, లెంకవారి కుటుంబాలకు చెందిన ఇంటమ్మ తల్లులకు పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించారు. అనంతరం కర్రసాము, కత్తిసాములతో గ్రామ పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. రాజమ్మతల్లి, ముత్యాలమ్మతల్లి, పైడితల్లి అమ్మ గుడులకు వెళ్ళి పసుపుకుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.