విజయనగరం

వేరుశెనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, మే 24: ప్రభుత్వం సబ్సీడిపై అందిస్తున్న వేరుశెనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పిటీసీ నర్సుపల్లి వెంకటరామలక్ష్మి కోరారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో గురువారం వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వేరుశెనగ విత్తనాలను వ్యాపారులకు ఇవ్వకుండా అవసరమైన రైతులకు మాత్రమే అందించాలన్నారు. ఈమేరకు విత్తనాలు కావల్సిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకాలను పిఏసీఎస్‌కు తీసుకువెళ్లి విత్తనాలను పొందాలన్నారు. అనంతరం ఏఓ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ 30 కేజీల వేరుశెనగ బస్తా 1830 కాగా అందులో సబ్సీడి 732 రూపాయలు పోగా రైతు వాటా కింద 1090 రూపాయలు చెల్లించాలన్నారు. అలాగే రైతులకు అవసరమైన కట్టెజనుము, పిల్లి పెసర వంటి విత్తనాలను 50శాతం రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన రైతులు వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, రైతలు పాల్గొన్నారు.

పోస్ట్ఫాస్ మూతపడటంతో వినియోగదారులు ఇబ్బందులు
తెర్లాం, మే 24: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న పోస్ట్ఫాసుల సిబ్బంది నిరవధిక సమ్మెలు చేపడుతుండటంతో వినియోగదారులు పలు ఇబ్బందులకు గురుతున్నారు. ఇందులో భాగంగా పోస్టల్ సిబ్బందికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిబ్బంది నిరవధిక సమ్మెను చేస్తున్నారన్నారు. గురువారం పోస్ట్ఫాసును మూసివేశారు. దీంతో ఎస్‌బీలు, రికరింగ్ డిపాజిట్లు, ఆర్‌పీ ఎల్ ఐ, పీ ఎల్ ఐ, ప్రీమియంలు చెల్లించేందుకు పలు ఇబ్బందులకు గురవుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం నెలాఖరు కావడంతో ఈనెల దాటితే అపరాధ రుసుం పడటంతోపాటు ఒక్కసారిగా రెండు నెలల ప్రీమియం చెల్లించాలంటే పలు ఇబ్బందులను ఎదుర్కొనవల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందించి పోస్టల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేదిశగా కృషి చేయాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.

ప్రత్యేక హోదా సాధించేంతవరకు పోరాటాలు చేస్తాం
తెర్లాం, మే 24: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సీఐటీయు డివిజన్ కార్యదర్శి రెడ్డివేణు డిమాండ్ చేశారు. స్థానిక పాతబస్టాండ్ ఆవరణలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలు నమ్మించి మోసం చేశాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కంటే ఫ్యాకేజీలో బాగుంటుందని ప్రజలను నిదులను రప్పించి వివిధ పథకాల కింది వినియోగించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చేంతవరకు వివిధ దశలలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ నాయకులు ఎస్ గోపాల్, కుచేల్‌రావు, కోట అప్పన్న, సింహాచలం, చంద్రావతి, గౌరి, సత్యవతి, సురేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.