విజయనగరం

ప్రత్యేక హోదా సాధనకు పోరాటాలు ఉదృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిజిపేట, మే 24 ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతం పోరాటాలు చేస్తామని సీపీఎం నాయకులు యమ్మల మన్మదరావు, వి సత్యంనాయుడులు హెచ్చరించారు. గురువారం స్థానిక బస్టాండ్ వద్ద సీపీఎం నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా 5కోట్ల ఆంధ్రుల హక్కుని, నాలుగేళ్లతరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయడం విడ్డూరమన్నారు. తెలుగుదేశంపార్టీ, బిజెపీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేశాయన్నారు. ఈమేరకు ప్రత్యేక హోదాతోపాటు ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వేజోన్, గిరిజన యూనివర్సిటీను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలవలస మురళీ, మజ్జి శ్రీరామ్మూర్తి, మండల ప్రసాద్, రెడ్ల రమణ, సీపీఎం నాయకులు బి భాను, ఎన్ ఈశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పశు సఖీలు సక్రమంగా పనిచేయాలి
తెర్లాం, మే 24: వెలుగు, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పశుసఖీలు సక్రమంగా పనిచేయాలని తెర్లాం పశుసంవర్థకశాఖ ఏడీ పి చంద్రశేఖరరావు కోరారు. స్థానిక పశువైద్య కేంద్రం ఆవరణలో గురువారం పశుసఖీల కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీ చంద్రశేఖరరావు మాట్లాడుతూ పశుసఖీలు గ్రామాల్లో స్వయం సహాయ సభ్యులకు పశువుల పెంపకం, వ్యాధులు వాటి నివారణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం పశుసంవర్థకశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను పశుసఖీలు స్వయం సహాయ సంఘాల సభ్యులకు వివరించాలని సూచించారు. పశువులకు ఎటువంటి వ్యాధులు సోకిన, మృతిచెందిన వెంటనే పశువైద్యాధికారులకు సమాచారం అందించాలన్నారు. వెలుగు ఏపీఎం బోడెల చిన్నారావు మాట్లాడుతూ మండలంలో పది పంచాయతీలను ఎంపిక చేసి పశుసఖీలను నియమించామన్నారు. ఆయాగ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాడి పరిశ్రమంతో అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి జె నరేంద్రకుమార్, వెలుగు సీసీలతోపాటు పశుసఖీలు పాల్గొన్నారు.