విజయనగరం

నీటి తీరువా వసూళ్లకు చర్యలు చేపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), మే 24: నీటి తీరువా వసూళ్లుపై చర్యలు చేపడుతున్నామని తహశీల్దార్ పి గణపతి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నీటి తీరువా 23లక్షల రూపాయలు వసూళ్లు కావల్సి ఉందని, ఇప్పటికే ఆయా వీఆర్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరైన విదుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతతో పనిచేసి మండలానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి సర్ట్ఫికేట్లు త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెవెన్యూపరంగా రైతులకు ఎటువంటి సమస్యలున్న తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు రైతులు తమ భూములను ఆన్‌లైన్ చేయించుకోవాలన్నారు. ఆయాగ్రామాల్లో వీఆర్‌ఓలు విధిగా పర్యవేక్షించి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేవిధంగా కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి
బొబ్బిలి(రూరల్), మే 24: ప్రభుత్వ విద్యతోనే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి చెందుతారని నారాయణప్పవలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెసి రాజు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈమేరకు మండలం కాశిందొరవలస, నారాయణప్పవలస గ్రామాల్లో గురువారం విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విద్య వలన చేకూరే ప్రయోజనాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తు విద్యార్థులను పాఠశాలలో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తామని, విద్యా హామీని తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో కొత్తగా చేర్పించేందుకు 60మంది విద్యార్థినీ విద్యార్థుల పేర్లును నమోదు చేశామన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఇంకా బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి విలువలతో కూడిన విద్యను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్‌ఎన్ రాజు, మురళీ, తదితరులు పాల్గొన్నారు.