విజయనగరం

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగం (్ఫర్టు, మే 24: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో మయూరి జంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిరసనదీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న బిజెపి, పదిహేనేళ్లు తెస్తామన్న టిడిపి ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ తప్పించుకుంటున్నాయని అన్నారు. అయిదు కోట్ల ఆంధ్రుల నెత్తిన చెంబుడు ఢిల్లీ నీళ్లు, పిడికెడు పార్లమెంట్ మట్టి నోట్లో కొట్టిన బిజెపి ప్రభుత్వానికి దాసోహమైన టిడిపి ప్రభుత్వం ఇప్పుడు అధర్మపోరాట దీక్షలు చేస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి కుయుక్తులతో ఆపార్టీ నేతలు సైకిల్‌యాత్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మరోసారి మోసపోవడానికి రాష్ట్ర సిద్ధంగా లేరని, ప్రత్యేక హోదా తీసుకురాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అశోక్ హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించేవరకూ పోరాటం ఆగదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు, జిల్లా సమితి సభ్యులు ఎస్.రంగరాజు, అప్పరుబోతు జగన్నాధం, పొందూరు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

అపారిశుద్ధ్యంతో కంపుకొడుతున్న గ్రామీణ ప్రాంతాలు
బొబ్బిలి(రూరల్), మే 24: గ్రామీణ ప్రాంతాల్లో అపారిశుద్ధ్యం తాంఢవించడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది వివిధ రోగాలతో ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈమేరకు మండల పరిధిలో ఉన్న పిరిడి గ్రామంలో అపారిశుద్ధ్యం రాజ్యమేలుతోంది. పాల కేంద్రం సమీపంలో చెత్తాచెదారం కుప్పలు, తెప్పలుగా పడి ఉండటంతో వాటిపై పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అటువైపు వెళ్లాలంటే ప్రజలు ముక్కుమూసుకోవల్సిందే. అధికారులు, పాలకులు అపారిశుద్ధ్యం నిర్మూలనకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కింతలవానిపేట గ్రామంలో కాలువల్లో పూడికలు పేరుకుపోతున్న వాటిని తొలగించే నాధుడు కరువయ్యారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రతీ ఏటా లక్షలాది రూపాయలు నిదులు మంజూరుచేస్తున్న అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చినుకుపడితే నీరంతా రోడ్లుపైనే నిల్వ ఉండి కంపుకొడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.