విజయనగరం

హోదా కోసం అర్థనగ్న ప్రదర్శన, రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మే 24: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రత్యేక హోదాకు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు రహదారిపై అర్థనగ్న ప్రదర్శన చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు జగన్మోహన్‌రావు, కిల్లంపల్లి రామారావు, పాపారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన లక్ష కోట్ల లోటు బడ్జెట్‌ను భర్తీచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రరాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిల్లంపల్లి రామకృష్ణ, సిపిఐ నాయకులు వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
ఆహ్లాదమా....ఏదీ నీ చిరునామా!!
* ఉనికిని కోల్పోతున్న పార్కులు * అటకెక్కిన ప్రతిపాదనలు
విజయనగరం (్ఫర్టు), మే 24: పట్టణంలో మున్సిపల్ పార్కులను అభివృద్ధి చేసేందుకు అయిదు కోట్ల రూపాయలతో తయారు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. ఫలితంగా దశాబ్ధాల చరిత్ర కలిగిన అనేక పార్కులు క్రమేపీ ఉనికిని కోల్పోతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. వీటి అభివృద్ధిపై మున్సిపల్ పాలకులు, అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల పట్టణ ప్రజలు ఆహ్లాదానికి దూరమవుతున్నారు. పట్టణంలో 49.62 ఎకరాల విస్తీర్ణంలో 103 పార్కులు ఉన్నాయి. ఇందులో 35 పార్కులకు కంచె నిర్మాణం చేపట్టలేదు. కాలనీల్లో ఉన్న పార్కుల్లో అర ఎకరానికి పైబడి ఆక్రమణకు గురయ్యాయి. వీటిని తొలగించే ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఆక్రమణదారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పూల్‌భాగ్, రాజీవ్‌నగర్ కాలనీల్లో పార్కులు ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్నాయి. వీటిని రక్షించే ప్రయత్నాలు చేపట్టకపోగా, అభివృద్ధి చేయడానికి తయారు చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంలేదు. అధికారుల నిర్లక్ష్యానికి పాలకుల అశ్రద్ద తోడుకావడంతో పార్కులన్నీ మోడువారుతున్నాయి, ముఖ్యంగా నాలుగేళ్ల క్రితం హుదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి వృక్షసంపద నేలమట్టం కావడంతో కళావిహీనంగా తయారయ్యాయి. పార్కులను ఆహ్లాదకరంగా తయారు చేసేందుకు నీరు-చెట్టు కార్యక్రమం కింద పెద్దఎత్తున మొక్కలు పెంపకం చేపడతామని పాలకులు, అధికారులు చేసిన ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. జిల్లా కేంద్రమైన విజయనగరంలో సరైన పార్కులు లేకపోవడం వల్ల ఆహ్లాదం కోసం పట్టణ ప్రజలు విశాఖపట్టణం వెళుతున్నారు. నెహ్రు, ప్రకాశం వంటి ప్రసిద్ధి చెందిన పార్కులు కూడా దయనీయంగా తయారయ్యాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన పార్కుల అభివృద్ధిపై పాలకులు, అధికారులు శీతకన్ను వేయడం వల్ల ఉనికిని కోల్పోతున్నాయి. కనీస సదుపాయాలతోపాటు క్రీడా పరికరాలు కూడా లేకపోవడం వల్ల విద్యార్థులకు సైతం ఆహ్లాదం కరువైంది. ఇదిలా ఉండగా రెండురోజుల క్రితం పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ పార్కులను అభివృద్ధి చేసేందుకు, పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్‌డి అనితను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయో వేచి చూడవల్సిందేనని పట్టణ ప్రజలు అంటున్నారు.