విజయనగరం

పచ్చిరొట్ట విత్తనాలు వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మే 24: ఖరీఫ్‌లో భూమిని సారవంతం చేసేందుకు పచ్చిరొట్టవిత్తనాలను రైతులు వినియోగించుకోవాలని స్థానిక మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర కోరారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 75శాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నామని, రైతులు వినియోగించుకోవాలని కోరారు. జీలుగ పూర్తి ధర 69రూపాయలు కాగా 51.75 రూపాయలు రాయితీపోను రైతు 17.25రూపాయలు చెల్లించాలని అన్నారు. జనుము విత్తనాలు 78రూపాయలు పూర్తికాగా 58.50రూపాయలు రాయితీపోను రైతు 19.50 రూపాయలు చెల్లించాలని, పిల్లి పెసర పూర్తి ధర 131 రూపాయలు కాగా 98.25రూపాయలు రాయితీపోను రైతు 32.75 రూపాయలు చెల్లించాలని కోరారు. పచ్చిరొట్ట విత్తనాల కోసం తమ కార్యాలయంలో పర్మిట్ తీసుకుని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో విత్తనాలు తీసుకోవాలని కోరారు.
కొత్తవలస విద్యార్థులకు కరాటేలో పతకాలు
కొత్తవలస, మే 24: దేశరాజధాని న్యూ ఢిల్లీలో జరుగుతున్న రెండవ అంతర్జాతీయ కరాటే పోటీల్లో కొత్తవలస విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. 25కిలోల విభాగంలో కె. అవినాష్ బంగారు పతకాన్ని సాధించగా, 45కిలోల విభాగంలో అల్లుసుధాకర్ బంగారు పతకాన్ని సాధించారని కోచ్ ఎం.ప్రకాష్ తెలిపారు. అదే విధంగా 33కిలోల విభాగంలో కొమ్మోజు వర్హ నాగ సంతోష్ రజిత పతకాన్ని సాధించారు. విద్యార్థులు పతకాలు సాధించినందుకు కోచ్ ఎం.ప్రకాష్‌ను విద్యార్థులను కుకువ కరాటే అకాడమీ చైర్మన్ జాన్లీ అభినందించారు.

ఉచిత లివర్ స్కాన్ శిబిరం విజయవంతం
గజపతినగరం, మే 24: మండలంలోని జిన్నాం గ్రామంలో గురువారం నిర్వహించిన ఉచిత లివర్ స్కాన్ శిబిరం విజయవంతంగా జరిగింది. రామమందిరం ఆవరణలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సుమారు ఆరువేల రూపాయల విలువ గల లివర్ స్కాన్ శిబిరంలో మద్యం సేవించిన వారు, మధుమేహవ్యాధి కలవారు, హెపటైటీస్,బిసి, పేటీ లివర్(కొవ్వు) గల 95మంది రోగులు ఈశిబిరాన్ని వినియోగించుకున్నారు. శిబిరాన్ని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి. ఎస్. ఆర్.మూర్తి ప్రారంభించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిఎం యినుముల నరేష్‌కుమార్‌లు రోగులను పరీక్షించారు. స్కానింగ్ చేయించుకునే వారు ఏమీ తినకుండా, తాగకుండా వచ్చారు. ఇజ్జిరోతు ఫౌండేషన్, విజయనగరానికి చెందిన చేతన్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇజ్జిరోతు చంద్రినాయుడు, ఇజ్జిరోతు రామునాయుడు, ఇజ్జిరోతు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.