విజయనగరం

ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మే 26: 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఓటర్లనమోదు కార్యక్రమం నిర్ధేశిత సమయంలో పూర్తిచేయాలని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. శనివారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశం హాలులో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోని పార్వతీపురం,బలిజిపేట, సీతానగరం మండలాలకు చెందిన తహశీల్దార్లు, బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు గతంలో ఓటర్లగా నమోదైన వారి జాబితాలో తప్పులుంటే సవరించే కార్యక్రమం కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఈకార్యక్రమం ఈనెల 21వ తేదీ నుండి కొనసాగుతున్నప్పటికీ వచ్చేనెల 30వ తేదీలోగా ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు నమోదు, గతంలోని వచ్చిన తప్పుల సవరణలు చేపట్టాలని కోరారు. ఓటు హక్కు నమోదు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం తహశీల్దారు అజురఫీజాన్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దారు అమలతో పాటు సీతానగరం, బలిజిపేట తహశీలార్దు, బి ఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

బిసి వెలమలను బిసి‘ఎ’లో చేర్చాలి
పార్వతీపురం, మే 26: బిసి వెలమలను బిసి ఎ జాబితాలో చేర్చాలని కోరుతూ పార్వతీపురం బిసి వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శనివారం స్థానిక భాస్కర్ హైస్కూల్‌లో కొప్పలవెలమ సంక్షేమ సంఘ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు చుక్క భాస్కరరావు, అమరపుసూర్యనారాయణలు మాట్లాడుతూ కొప్పలవెలమలను బిసి డి జాబితా నుండి బిసి ఎ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బిసి వెలమలకు ప్రత్యేకంగా వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సామాజికంగా ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం మండల స్థాయి కొప్పలవెలమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గౌరవాధ్యక్షునిగా వంగపండు వసంతనాయుడు, అధ్యక్షునిగా కొల్లి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శిగా ద్వారపురెడ్డి లక్ష్ముంనాయుడు, కోశాధికారిగా దత్తికూర్మినాయుడులతో పాటు పలువురు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నుకున్నారు. ఎన్నికలను డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరరావు, సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గసభ్యులు చొక్కాపు వెంకటరమణ, బడే గౌరునాయుడుల సారధ్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో నాయకులు గుల్ల రామినాయుడు, వెలమల గౌరునాయుడు, తోడబండి తాతబాబు, బడే గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఐటిడి ఎ టీచర్ల పదోన్నతుల్లో ఉపాధ్యాయసంఘాలకు ఆహ్వానించకపోవడం శోచనీయం
పార్వతీపురం, మే 26: ఐటిడి ఎ పరిధిలో గల గిరిజన సంక్షేమ టీచర్ల పదోన్నతుల కౌనె్సలింగ్‌కు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం, ఎపిటి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మర్రాపుమహేష్‌లు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించే సమయంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించే ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఇటీవల విద్యాశాఖ ఈవిధాలను తిలోదకాలివ్వడం శోచనీయమన్నారు. అదేవిధంగా శనివారం గిరిజన సంక్షేమశాఖ డిడి కార్యాలయంలో నిర్వహించే ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉపాధ్యయ సంఘాలను పిలవడం లేదని ఈవిషయంలో తమకు స్పష్టమైన ఉత్వర్వులు లేవని డిడి చెప్పడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు ఆహ్వానిస్తే పారదర్శకంగా జరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈవిషయమై విద్యాశాఖామంత్రికి తాము చర్యలు తీసుకోవాలని కోరతామని వారు పేర్కొన్నారు.