విజయనగరం

పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), మే 26: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయవల్సిన అవసరం ఉందని మండలం నారాయణప్పవలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెసి రాజు అన్నారు. ఈమేరకు నారాయణప్పవలస పాఠశాల ఆవరణలో శనివారం వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పులను, అత్యధిక వేడిని నియంత్రణ చేసేవి పచ్చని చెట్లేనని, వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. వాతావరణం సమతౌల్యంలో ఉండాలన్న, భూమి వేడెక్కకుండా చేయాలన్న వాతావరణంలో ఉష్ణోగ్రత్తలను నియంత్రించాలన్న చెట్లును పెంచడమే ఏకైక మార్గమన్నారు. ప్రతీ ఒక్కరూ వీటిని బాధ్యతగా భావించి చెట్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఉచితంగా మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రోడ్లుకిరువైపులా, ఖాళీ స్థలాల్లోను, పాఠశాలల ఆవరణలోను, ఇళ్ల ముందు, పెరటిలోను విరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్‌ఎన్ రాజు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా పిరిడిలో సామూహిక హారతి కార్యక్రమం
బొబ్బిలి(రూరల్), మే 26: మండలం పిరిడి గ్రామంలో శనివారం సామూహిక హారతి కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. హిందూ ధర్మప్రచారక్‌లు ధూపం వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులలో దైవభక్తిని పెంపొందించేందుకు మరింత కృషి చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను విరివిగా చేపట్టి ప్రజలను ఉత్తేజపర్చడం జరుగుతుందన్నారు. వీటిని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా గ్రామపెద్దలు జాగాన రామకృష్ణరంగారావు, కొల్లి అప్పలనాయుడు, కొల్లి సూర్యనారాయణలు మాట్లాడుతూ గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. ప్రధానంగా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణస్వామి, బొత్స పైడపునాయుడు, జామి సూరిదాసు, జాగాన సుబ్బలక్ష్మి, జాగాన రామారావుతోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
వైసీపీ వైపు టీడీపీ నాయకుల చూపు
* రంగులు మారనున్న రామభద్రపురం రాజకీయం
రామభద్రపురం, మే 26: మండలంలో అధికశాతం తెలుగుదేశంపార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరో ఏడాదికాలంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచే వలసలు ఆరంభమయ్యాయి. మండలంలో 22 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. అయితే వీరిలో చాలామందికి తెలుగుదేశంపార్టీపై అయిష్టత ఉన్నప్పటికీ బొబ్బిలి రాజులపై ఉన్న అభిమానంతోనే టీడీపీలోకి చేరారు. ప్రస్తుత పరిస్థితులలో వీరంతా తమ సొంతగూటికి వెళ్లిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామభద్రపురం, ఎస్ సీతారాంపురం, సోంపురం, తారాంపురం గ్రామాలకు చెందిన యువత పెద్ద ఎత్తున వైసీసీ జిల్లా నాయకులు మజ్జి శ్రీనివాసరావు(చినశ్రీను) ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అధికార పార్టీ ఇచ్చే తాయిలాలు అందుకుని పార్టీని మారే యోచనలో చాలామంది టీడీపీ నాయకులు ఉన్నారు. అలాగే మండలానికి చెందిన ఇద్దరు ప్రముఖ టీడీపీ నాయకులు జిల్లా వైసీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని, వీరు కూడా పార్టీ మార్చే యోచనలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి నాయకులతో అధికశాతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన టీడీపీ ప్రత్యేక హోదా కార్యక్రమంలో నిర్వహించిన సైకిల్ యాత్రలో ఈ ఇద్దరు నాయకులు అంటిముట్టినట్లుగా వ్యహరించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు కూడా పార్టీని వీడటానికి ఒక సాకుగా చూపుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న రామభద్రపురం మండలంలో ప్రస్తుతం ఆ పార్టీ నాలుగు వర్గాలుగా వీడిపోయింది. దీంతో పార్టీ ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అయినప్పటికీ టీడీపీ అధిష్టానం దృష్టిసారించకపోవడంతో పార్టీ మరింత బలహీనపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఉన్నప్పటికీ వర్గవిభేదాలపై దృష్టిసారించకపోవడం విశేషం. మండలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులలో వీరంతా పార్టీ కార్యకర్తలతో చర్చించి వరి అభిప్రాయాల మేరకు పార్టీని మారాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఏదీ ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో రామభద్రపురం మండలంలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.