విజయనగరం

సాధికార మిత్రలు వారధిగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మే 26: సాధికార మిత్రలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేయాలని కమిషనర్ టి.జయరామ్ అన్నారు. శనివారం జరజాపుపేట గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో సాధికార మిత్రల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ జయరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయాలేదా అని సాధికార మిత్రలు పరిశీలించాలని అన్నారు. అంతేకాకుండా మహిళా గ్రూపులను సమన్వయపరచి ప్రభుత్వ పథకాల వల్ల కలుగు ప్రయోజనాలను తెలియపరచాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించే విధంగా కృషి చేయాలని చెప్పారు. అలాగే సాధికార మిత్రలు, సామాజిక అంశాలు, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. ప్రతి 35కుటుంబాలకు విధిగా ఒకసాధికార మిత్ర ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా ఎస్‌ఎంసి రవికుమార్, టిఎంసి గేదెలరాము, సివొ కనకమహాలక్ష్మి, జన్మభూమి కమిటీ సభ్యులు చింతాడ కళావతి పాల్గొన్నారు.

ముగిసిన వేసవి క్రీడా శిక్షణా తరగతులు
బొండపల్లి, మే 26: మండలంలోని రాచకిండాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 15రోజులుగా వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామస్తులు సంయుక్తంగా నిర్వహించిన బేస్ బాల్ వేసవి శిక్షణా శిబిరం శనివారంతో ముగిసాయి. ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జె.సతీష్ కుమారి, పక్కి గ్రామం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జె.రామారావులు ఆసక్తికలిగిన యువతీ యువకులకు బేస్‌బాల్ క్రీడలో శిక్షణ అందించారు. 15రోజులుపాటు విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఉత్తేజంతో ఈశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రతి ఏడాది వేసవిలో శిక్షణ అందించి సూచనలు, ఆటల్లో ఉన్న మెళకువలపై అవగాహన కల్పించడం జరుగుతుందని పిఇటి సతీష్ కుమార్ తెలిపారు. దాతలు ప్రోత్సహించిన యెడల మంచి ఆశయంతో ఉన్న విద్యార్థులు రాష్ట్ర స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారానికే పల్లెకు పోదాం
బొండపల్లి, మే 26: గ్రామాలలో సమస్యలు పరిష్కరించేందుకు పల్లెకు పోదాం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎంపీడీవొ ఎం.ప్రకాశరావు అన్నారు. మండలంలోని వెదురువాడ గ్రామంలో శుక్రవారం రాత్రి పల్లెకు పోదాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు. అయితే ఇంకనూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను అనే్వషించేందుకు పల్లెకుపోదాం దోహదపడుతుందని అన్నారు. ప్రజలముందుకు అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అందువలన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవొ ప్రకాశరావుస్పష్టంచేశారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ బాపిరాజు, ఇవొపి ఆర్డీ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి రవీంద్ర, ఏపీఎం పెంటంనాయుడు, ఏపీవొ రవిబాబు, ఎంఇవొ సింహాచలం, ఆర్‌డబ్ల్యు ఎస్‌ఎఇ నవీన్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ గాయత్రి దేవి, గ్రామ కార్యదర్శి మహేష్, సర్పంచ్ నారాయణమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

30,31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
విజయనగరం (్ఫర్టు), మే 26: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయడంలో కేంద్రప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తున్నందున ఈనెల 30,31 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించామని ఆంధ్రాబ్యాంకు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది రమేష్ తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఆధ్వర్యంలో అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు 48గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా సమ్మె విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. పట్టణంలో ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌లోనే తమకు వేతన సవరణ జరగాల్సి ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు. దీంతో గత్యంతరం లేక సమ్మె చేయవలసి వస్తుందని, సమ్మె ద్వారా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయాలనిగాని, ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేయాలని గాని తమ ఉద్ధేశ్యం కాదని అన్నారు. కేవలం వేతన సవరణ అమలు కోసం మాత్రమే సమ్మె చేస్తున్నామని రమేష్ తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఉద్యోగులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, తమ న్యాయమైన సమస్యలపై చేస్తున్న పే సెటిల్మెంట్‌కు తాము వ్యతిరేకం కాదని, కమిటీ నివేదికలు ఉద్యోగులకు వేజ్ రిజిజన్ రెండుశాతం మాత్రమే చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, బ్యాంకులకు వచ్చిన లాభాల్లో రెండుశాతం పెంచుతామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు బ్యాంకు ఉద్యోగులు చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండటం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరిగిందని చెప్పారు. కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన విధంగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ కోశాధికారి కిషోర్‌బాబు, నాయకులు ఎస్.శాంతీశ్వరరావు, మురళీ శ్రీనివాస్, వెంకటాచలం, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.