విజయనగరం

20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 28: జిల్లా లో ఇంతవరకు 135 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని డి ఆర్‌డిఎ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్‌రావు అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయాన్ని ఎపిడి సుధాకర్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు వ్యాపారం చేసుకోవాలని నిర్ణయిస్తే సంఘ ప్రగతిని బట్టి ఏడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రయోగాత్మకంగా రామభద్రపురం మండలంలో డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు 35 దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాధనలు సిద్ధం చేసామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 జనరీక్ ఔషధ దుకాణాలు ఏర్పాటు చేయగా లాభాల్లోనే ప్రస్తుతం నడుస్తున్నాయని చెప్పారు. పెట్టుబడి నిధికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1200 మంది సభ్యులకు నిధి మొత్తం వారి ఖాతాల్లో సాంకేతిక లోపం కారణంగా జమకాలేదని అన్నా రు. వాటిని పరిశీలించి వారి ఖాతాలలో మొత్తం జమ చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 45 స్వయం సహాయక సంఘాలను గుర్తించామని వారితో వ్యాపారాలు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోండి
* జాయింట్ కలెక్టర్‌కు వైఎస్‌ఆర్ పార్టీ వినతి
విజయనగరం(టౌన్),డిసెంబర్ 28:రైతులనుండి సత్వరమే ధాన్యం కొనుగోలు చేసి వెనువెంటను చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుని అన్నదాతను ఆదుకోవాలని కోరుతూ జిల్లా వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు సోమవారం జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్‌కు వినతిపత్రం అందచేసారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామినేతృత్వం లో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పి.సాంబశివరాజు, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణారంగారావు, రాజన్నదొర, పుష్పాశ్రీవాణి తదితర నాయకులు జెసిని ఆయన ఛాంబరులో కలుసుకుని ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న పలుసమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అదనపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం ఎక్కువగా పండించే గ్రామాల్లో ఎర్పాటు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలించేలా చూడాలని ఈ విషయాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సంక్రాంతి పండుగ వస్తున్ననేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు చెల్లింపులు సత్వరమే చేసేలా చూడాలని జెసి బాలజీ లఠ్కర్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, కొన్న ధాన్యం వెంటనే మిల్లర్లు తీసుకువెళ్లే లా చొరవ తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజు ఐదువేల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని చివరి కెజీ ధాన్యం కొనే వరకు రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారికి ఆయన హామీ ఇచ్చారు. మిల్లర్లు చెల్లించాల్సిన బ్యాంకు గ్యారంటీ విషయంలో కొంత ఆలశ్యం చోటుచేసుకుందని వరుసగా బ్యాంకులకు సెలవులు వచ్చిన కారణంగా ఈ సమస్య వచ్చిందని, సోమవారం మిల్లర్లు నుండి గ్యారెంటీలు అందుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుంగా అన్ని చర్యలు తీసుకుంటాయని వారికి హామీ ఇచ్చారు. కాగా ధాన్యం కొనుగోలు సందర్భంగా గత ఏడాది వెలుగు సంఘాలు కొన్నింటికి చెల్లింపులు కాలేదని, దీపం గ్యాస్ కనెక్షన్లు విషయంలో డీలర్లు నిర్ణీత రుసుం 870 రూపాయలు కాకుండా లబ్ధిదారుల నుండి 3500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు జెసి దృష్టికి తెచ్చారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణారంగారావు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిలు మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా కొన్ని కేంద్రాల్లో ఒక కేజి ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని సీతానగరం మండలం మరిపివలసలోగత ఏడాది కొనుగోలు లో మూడవ స్ధానంలో ఉంటే ఈ ఏడాది ఒక్క బస్తా కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కొన్న చోట్ల వేలాది బస్తాల ధాన్యం మిల్లర్ల బ్యాంకు గ్యారంటీ ఆంక్షల కారణంగా ఆరుబయట నిల్వ ఉండిపోయాయని ఇందువలన తేమ, ఇతర కారణాలతో ధాన్యం వేసిన రైతులు నష్ట పోతారని ఆందోళన వ్యక్తంచేసారు. బాడంగి మండలంలో నాలుగు కేంద్రాలు ఉన్నా ఉపయోగం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికయినా రైతులు పడుతున్న కష్టాన్ని ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి చెల్లింపులు వెంటనే పండుగ మందర జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కెవిసూర్యనారాయణ రాజు, బెల్లాన చంద్రశేఖర్, శ్రీరాములునాయుడు, అప్పలనాయుడు, సురేష్‌బాబు,నెక్కలనాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.