విజయనగరం

పట్టణంలో వడగళ్ల వాన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 17: గత వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన జనానికి ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో వాతావరణం చల్లబడింది. సాయంత్రం 4.30 గంటల నుంచి 4.50 గంటల వరకు వడగళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి ఆటలాడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లిన చిన్నారులు ఆనందంతో తడిసిముద్దయ్యారు. ఈ వర్షం చెరకు, వరి నారుమళ్లకు ఎంతగానో దోహదపడతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షానికి ఆర్ అండ్ బి రైతు బజారు వద్ద ఉన్న హోర్డింగ్ నేలకూలింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో బాధపడిన జనానికి వర్షం కురవడంతో సేదతీరారు. కాగా, బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోంది. జిల్లాలో అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఈదురుగాలులు, వడగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.