విజయనగరం

కార్మికుల సమస్యలపై ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 18: ఆర్టీసీ విజయనగరం జోన్‌లో అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ జోనల్‌కార్యదర్శి శ్రీనివాసరాజు హెచ్చరించారు. సోమవారం యూనియన్ డిపో కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంపట్ల యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తుందన్నారు. విజయనగరం జోన్ పరిధిలో అన్ని డిపోల్లోనూ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయని తెలిపారు. ఈ సమస్యలు ఇలాగుంటే కార్మికులపై పనిభారం పెంచే విధంగా యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందన్నారు. అద్దెబస్సులను పెంచడంతోపాటు మెయింటెనెన్స్ సిబ్బందిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఈ సమస్యలపై ఈనెల 19, 20 తేదీల్లో అన్ని ధర్నాలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ డిపోకమిటీ కార్యదర్శి పిజి రాఫిల్, అధ్యక్షుడు డిఎన్ రాజు పాల్గొన్నారు.

అద్దె బస్సులు పెంచే యోచనపై ధర్నా
విజయనగరం (్ఫర్టు), జూన్ 18: ఆర్టీసీలో అద్దెబస్సులను 35 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు విరమించాలని, పెంచినా మెయింటెనెన్స్ పనిభారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపారుూస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ డిపో ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ డిపోకమిటీ కార్యదర్శి టిఎస్‌ఎన్‌రాజు మాట్లాడుతూ ఆర్టీసీలో సిబ్బందిని తగ్గించాలన్న కుట్రలో భాగంగా ప్రస్తుతం 20శాతం ఉన్న అద్దెబస్సులను 35 శాతానికి పెంచేలా ప్రతిపాతనలు తయారు చేశారని తెలిపారు. దీనిపై ఈనెల 19వ తేదీన విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో జరిగే పాలకమండలి సమావేశంలో అద్దెబస్సులు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఉద్యమాలు చేస్తామన్నారు. ఇప్పటికే గ్యారేజీల్లో పనిచేస్తున్న మెయింటెనెన్స్ సిబ్బందిని తగ్గించి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పెంచారని ఆయన ఆరోపించారు. ఇంకా మిలిగి ఉన్న మెయింటెనెన్స్ సిబ్బందిపై పనిభారం పెంచే విధంగా ఈనెల 15వతేదీన సర్క్యులర్‌ను జారీ చేశారని, దీనిని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చవక శ్రీను, జివిఎన్‌రావు, పిఎస్‌రావు పాల్గొన్నారు.