విజయనగరం

‘సదరం వెంటనే నిర్వహించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 18: జిల్లాలో గత కొన్నినెలలుగా నిలిచిపోయిన సదరం కార్యక్రమాన్ని వెంటనే నిర్వహించాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు కోరారు. సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లాకలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్‌కు ఒక వినతిపత్రం ఆయన అందజేశారు. దివ్యాంగులు ధ్రువీకరణపత్రాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నారని చెప్పారు. సదరం ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాలని, వెంటనే ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని కోరారు. ఆగస్టులో సదరం నిర్వహించి అర్హులైన వారందరికీ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారని, వెంటనే సదరం నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.

పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు
* ఎమ్మెల్యే మీసాల గీత
విజయనగరం (్ఫర్టు), జూన్ 18: పట్టణంలో అభివృద్ధిపనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధిపనులు జరుగుతున్నాయని చెప్పారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పట్టణంలో 18వ వార్డులో 7.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ అన్నివార్డుల్లోనూ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రసుత్తం జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆమె ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఎస్.మత్స్యరాజు, 18వ వార్డు కౌన్సిలర్ కెల్ల జానకీదేవి పాల్గొన్నారు.