విజయనగరం

నిరుపేదలకు ఇళ్ల కోసం సిపిఐ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగం (్ఫర్టు), జూన్ 18: పట్టణంలో ఇళ్లులేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ మండల తహశీల్దార్ కార్యాలయం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సహాయకార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులకు ఇళ్లు నిర్మించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు గడుస్తున్నా పేదలకు ఇళ్లు నిర్మించడం లేదన్నారు. అలాగే అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేయాలన్నారు. పేదల స్వాధీనంలో ఉన్న ఖాళీ స్థలాలకు, సాగుభూములకు పట్టా ఇవ్వాలన్నారు. జన్మభూమి కమిటీలో పక్కా ఇళ్లు, పట్టాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు ఇతర వాటి కోసం పెట్టుకున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. పేదలకు మూడువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నారు. పేదల నివాసిత ప్రాంతాల్లో రక్షిత మంచినీరు, వౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావుభూ కమిటీ సిఫార్సులను బేషరతుగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజక కార్యదర్శి బుగత సూరిబాబు, నియోజకవర్గసభ్యులు అప్పరుబోతు జగన్నాధం, పొందూరు అప్పలరాజు పాల్గొన్నారు.