విజయనగరం

అక్రమ తవ్వకాల్లో ఇరు పార్టీలకు వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 19: జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వాటాలు ఉన్నాయని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు. మంగళవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో చీపురుపల్లి, గరివిడి, ఎస్‌కోట, మెరకముడిదాం, వేపాడ, మెంటాడ, గుమ్మలక్ష్మిపురం, సాలూరు మండలాల్లో అంతులేని అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. అధికారులు చిన్న వాళ్లను వేధించి, పెద్ద వాళ్ల జోలికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అనధికార తవ్వకాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు వాటాలున్నాయని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే దందాలు ప్రారంభమయ్యాయని అందువల్లనే మంత్రులు, ఎమ్మెల్యేలు వౌనంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపి నిజాలను నిగ్గుతేల్చాలన్నారు.
భూముల వివరాలు తెలపండి
బ్రిటీష్ కాలం నుంచి సాగుచేస్తూ అమ్ముకోడానికి వీలులేని, తాత, ముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూములు 22‘ఎ’లో ఉంటే వాటి సవరణ కొరకు ఆయా వివరాలను తమ కార్యాలయానికి పంపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎర్రినాయుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు.